Thamma Trailer Review: బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దుమ్ములేపుతున్న ‘మ్యాడ్ లాక్’ సంస్థ నుండి వచ్చే నెల 21వ తేదీన ‘థామా'(Thama Movie) అనే చిత్రం రాబోతుంది. ఆయుశ్మాన్, రష్మిక మందాన(Rashmika Mandanna) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ హారర్ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నిన్న విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. హాలీవుడ్ వెబ్ సిరీస్ లు మరియు సినిమాలను చూసేవారికి ఈ ట్రైలర్ ని చూసినప్పుడు పెద్దగా కొత్తగా ఏమి అనిపించదు. కానీ మిగతా ఆడియన్స్ కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇందులో హీరో తనకు తెలియకుండానే వ్యాంపైర్ లాగా మారిపోతూ ఉంటాడు. నెట్ ఫ్లిక్స్ లో ‘ది వ్యాంపైర్ డైరీస్’ అనే భారీ వెబ్ సిరీస్ ఒకటి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ని ఆధారంగా చేసుకొనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు అనిపిస్తుంది.
ఇక హీరోయిన్ రష్మిక మందాన క్యారక్టర్ కూడా చాలా మిస్టీరియస్ గా అనిపిస్తుంది. ఆమె కూడా ఒక ప్రత్యేక లోకానికి సంబంధించిన వ్యక్తిగా ఇందులో చూపించాడు డైరెక్టర్. చూస్తుంటే బాలీవుడ్ లో రష్మిక కి మరో బలమైన క్యారక్టర్ పడినట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆమె చేసిన ప్రతీ బాలీవుడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేసుకున్నాయి. కానీ ఈ ఏడాది విడుదలైన ‘సికిందర్’ చిత్రం మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఆమె ఈ హారర్ చిత్రం తో కం బ్యాక్ ఇవ్వబోతున్నట్టు ఈ ట్రైలర్ ని చూసిన ప్రతీ ఒక్కరికి అనిపిస్తుంది. చూడాలి మరి ఆడియన్స్ ని ఈ చిత్రం ఎంత వరకు అలరిస్తుంది అనేది. ఈ చిత్రం పరేష్ రావెల్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. డిఫరెంట్ హార్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా ‘మ్యాడ్ లాక్ ఫిలిమ్స్’ సంస్థ కు మరో భారీ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.