Devi Sri Prasad- Thaman: తీవ్రమైన పోటీ ఉన్న రంగాల్లో చిత్ర పరిశ్రమ ఒకటి. ఇక్కడ టాలెంట్ ఉన్నోళ్లకే స్థానం ఉంటుంది. ఎవరు బెస్ట్ ఇస్తారో వాళ్లకు నంబర్ వన్ చైర్ సొంతం అవుతుంది. మ్యూజిక్ విషయానికి వస్తే మణిశర్మ దశాబ్దానికి పైగా టాలీవుడ్ ని ఏలారు. 90లలో మొదలైన ఆయన హవా చాలా కాలం సాగింది. స్టార్ హీరో సినిమా అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. రెండు జెనరేషన్ స్టార్స్ కి మణిశర్మ మ్యూజిక్ అందించారు. మెల్లగా దేవిశ్రీ ఆధిపత్యం మొదలైంది.

మణిశర్మను సెకండ్ పొజిషన్ లోకి నెట్టి దేవిశ్రీ నెంబర్ వన్ అయ్యాడు. దాదాపు 20 ఏళ్లుగా పరిశ్రమలో పాతుకుపోయిన దేవి అనేక బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చారు. మణిశర్మ, దేవిశ్రీ మధ్యలోకి నేనున్నానంటూ థమన్ ఎంట్రీ ఇచ్చాడు. కిక్ సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ చాలా కొత్తగా అనిపించింది. ఆ సినిమా విజయంలో కీలకం అయ్యింది. ఆ సినిమాతో థమన్ వెలుగులోకి వచ్చాడు.
అయితే థమన్ కెరీర్ పడుతూ లేస్తూ వచ్చింది. స్థిరంగా కొన్నాళ్ళు థమన్ మంచి మ్యూజిక్ ఇవ్వలేకపోయేవాడు. అప్పుడప్పుడూ కాపీ ఆరోపణలు ఎదుర్కుంటూ ఉండేవాడు. దేవిశ్రీ మాత్రం స్టార్ గా దూసుకుపోతూ ఉండేవాడు. ఒక దశలో బాగా డల్ అయిన థమన్ అరవింద సమేత వీర రాఘవతో మళ్ళీ లేచాడు. అల వైకుంఠపురంలో తో అందరి మైండ్స్ బ్లాక్ చేశాడు.

అల వైకుంఠపురంలో మ్యూజిక్ సెన్సేషన్స్ క్రియేట్ చేసింది. ప్రతి పాట సూపర్ హిట్ కాగా యూట్యూబ్ లో సంచలన రికార్డ్స్ నమోదు చేశాయి. తెలుగు పాటలు దేశాన్ని ఊపేయడం మామూలు విషయం కాదు. దెబ్బకు దేవిశ్రీని వెనక్కి నెట్టి థమన్ టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం స్టార్స్ అందరూ ఆయన వెనుక పడుతున్నారు. విజయ్ వారసుడు, బాలకృష్ణ 107, 108, మహేష్ SSMB 28, రామ్ చరణ్ RC-15 చిత్రాలకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఇంత డిమాండ్ ఉన్న థమన్ సినిమాకు ఎంత తీసుకుంటున్నారో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. ఆయన సినిమాకు రూ. 4 కోట్లు తీసుకుంటున్నారట. దేవిశ్రీ రెమ్యూనరేషన్ కంటే ఇది ఎక్కువని తెలుస్తుంది.