https://oktelugu.com/

Thaman: త్వరలోనే ‘వకీల్ సాబ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ : తమన్

Thaman: టాలీవుడ్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అభిమానులు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినీ సెల‌బ్రెటీల్లో సైతం ఆయన్ని దేవుడిలా  కొలుస్తారు. అలానే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫ్లైట్‌లో వెళ్తూ వకీల్ సాబ్ సినిమాను చూస్తున్నట్టు విమానంలో 37,000 అడుగుల ఎత్తులో చెప్పాడు. ‘వకీల్ సాబ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ నవంబర్ 16 […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 24, 2021 / 06:44 PM IST
    Follow us on

    Thaman: టాలీవుడ్ లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అభిమానులు ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినీ సెల‌బ్రెటీల్లో సైతం ఆయన్ని దేవుడిలా  కొలుస్తారు. అలానే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఫ్లైట్‌లో వెళ్తూ వకీల్ సాబ్ సినిమాను చూస్తున్నట్టు విమానంలో 37,000 అడుగుల ఎత్తులో చెప్పాడు. ‘వకీల్ సాబ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ నవంబర్ 16 న విడుదల అవుతాయని ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

    వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన సినిమా వకీల్ సాబ్. కరోనా సమయంలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం అందుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబ‌ట్టింది. పవర్ స్టార్ కి జోడిగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. అంజలి, నివేదా థామస్, అనన్య ఈ చిత్రానికి కీలక పాత్ర పోషించారు.

    కాగా తమన్ స్వరాలు కూడా మూవీ లో  హైలెట్ గా నిలిచాయి. మగువ మగువ పాట హిట్ గా నిలిచింది. మ‌హేశ్ బాబు న‌టిస్తున్న ‘సర్కారు వారి పాట’, బాల‌కృష్ణ న‌టించిన ‘అఖండ’ పవర్ స్టార్ న‌టిస్తున్న భీమ్లా నాయ‌క్ ,వంటి చిత్రాలకు స్వరాలు అందిస్తున్నారు తమన్. ప్రస్తుతం ఈ ట్వీట్ కు పవర్ స్టార్ అభిమానులంతా జై పవర్ స్టార్ అంటూ  కామెంట్లు  చేస్తున్నారు. అలానే ఈ ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.