SS Thaman : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి భారీ రేంజ్ లో ఎలివేట్ అవ్వడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక హీరోగా కూడా పవన్ కళ్యాణ్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. దానికి తగ్గట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాల్లో కూడా భారీ విజయాలను సాధించాలనే దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం అయిన హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu),ఓజి(OG) సినిమాలను తొందరగా ఫినిష్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఓజీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ మాత్రం ఇప్పటికే ఓ జి సినిమా మీద హైప్ పెంచేస్తున్నాడు. మొన్నటికి మొన్న ఓజీ మూవీ గ్యాంగ్ స్టర్ సినిమాలన్నింటికీ ఒక బెంచ్ మార్క్ గా మారబోతుంది అంటూ సినిమా మీద హైప్ ని క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు ఓ జి సినిమాకి నేను ఇచ్చే మ్యూజిక్ కి థియేటర్లో బాక్సులు పగిలిపోతే అది నా తప్పు అయితే కాదు అంటూ అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ వార్తను విన్న పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం తమన్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మొత్తానికైతే తమన్ అన్న ఈ సినిమాతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇక తమన్ చెప్పినట్టుగానే ఈ సినిమాకి థియేటర్లలో స్పీకర్లు దద్దరిల్లబోతున్నాయా తద్వారా పవర్ స్టార్ స్టామినా ఏంటో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తెలవబోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారతాడని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
కానీ మొత్తానికైతే ఈ సంవత్సరంలో ఈ సినిమాని రిలీజ్ చేసి తను ఏంటో చూపించుకోవాలని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరాటపడుతున్నట్టుగా తెలుస్తోంది… మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా తద్వారా పవర్ స్టార్ రేంజ్ మారబోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది…