SS Thaman: సౌత్ ఇండియా లో ప్రస్తుతం టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో తమన్ టాప్ 2 స్థానాల్లో ఉంటాడు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఇలా అందరూ తమన్ ని తమ సినిమాలకు సంగీత దర్శకుడిగా ఎంచుకుంటున్నారు. ఏడాది లో ప్రతీ నెల తమన్ నుండి ఒక సినిమా ఉంటుంది అనడంలో అతిశయోక్తి కాదేమో. ఒక్కోసారి రెండు, మూడు సినిమాలు కూడా ఉండొచ్చు. ఈ సంక్రాంతికి ఆయన సంగీత దర్శకత్వం వహించిన ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు రెండు రోజుల గ్యాప్ లో విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాల ఫలితాలు ఏమిటి అనేది కాసేపు పక్కన పెడితే ఈ రెండు సినిమాల్లోనూ తమన్ సంగీతం కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అయితే థియేటర్స్ లో ఆడియన్స్ కి గూస్ బంప్స్ రప్పించే రేంజ్ లో ఉన్నాయి.
ఒక్కో సినిమాకి తమన్ 6 నుండి 10 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడు. అయితే తమన్ తన తీరిక సమయాల్లో క్రికెట్ ఆడడం వంటివి చేస్తుంటాడు. మధ్యలో ఇండియన్ ఐడల్ వంటి మ్యూజిక్ షోస్ కి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే ఆయన సినిమాల ద్వారా వచ్చే సంపాదన మాత్రమే తన కోసం, తన ఇంటి ఖర్చుల కోసం వాడుకుంటాడు. క్రికెట్ మరియు ఇండియన్ ఐడల్ ద్వారా వచ్చే డబ్బులను మాత్రం చారిటీ కి డొనేట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం రీసెంట్ గానే సోషల్ మీడియా లో బయటపడింది. దీనికి నెటిజెన్స్ నుండి తమన్ పై ప్రశంసల వర్షం కురిసింది. రూపాయి బయటకి తీయాలంటే వంద ఆలోచించే మనుషులు ఉన్న ఈరోజుల్లో, లక్షల రూపాయిల డబ్బులను చారిటీ కోసం కేటాయించడం నిజంగా అభినందించ్చ దగ్గ విషయమని అంటున్నారు నెటిజెన్స్.
ఇక తమన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ తో ‘ఓజీ’, బాలయ్య బాబు తో ‘అఖండ 2 ‘, ప్రభాస్ తో ‘రాజాసాబ్’ వంటి చిత్రాలు చేస్తున్నాడు. వీటిల్లో ‘ఓజీ’ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. గత ఏడాది విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ‘నెత్తురుకి మరిగిన హంగ్రీ చీతా’ అంటూ సాగే చిన్న ఆడియో బీట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ప్రముఖ తమిళ హీరో శింబు తో ఒక పాట ని పాడించాడు. త్వరలోనే ఈ పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో స్పెషల్ గా తీసుకున్న ఈ చిత్రానికి తమన్ ప్రాణం పెట్టి పనిచేస్తున్నాడు. మరో పక్క అఖండ 2 కి కూడా అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.