`కిక్ `సినిమాతో తెలుగు నాట సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకొన్న సంగీత దర్శకుడు థమన్ తాజాగా విడుదలైన ` అల వైకుంఠపురంలో` పాటలతో ఊహించని స్థాయికి వెళ్లి పోయాడు. దరిమిలా తమన్ కోసం ఇప్పుడు పెద్ద , పెద్ద హీరోలు క్యూ కడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమన్ ని పట్టించుకోని హీరోలు ఇపుడు థమన్ నే సంగీత దర్శకుడిగా తమ సినిమాలకు పనిచేయాలని కోరుకొంటున్నారు . ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా `వకీల్ సాబ్ `చిత్రానికి తమన్ పని చేస్తున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ , నాని , సాయి తేజ్ , రవితేజ చిత్రాలకు సంగీతం వహిస్తూ బిజీగా ఉన్న థమన్ కి ఊహించిన పెద్ద అఫర్ తమిళం నుంచి వచ్చింది. .
నెలాఖరి వరకు లాక్ డౌన్:కేసీఆర్
రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ ` విజిల్ ` ఫేమ్ విజయ్ అల వైకుంఠపురములో పాటలు విని తమన్ తన తరవాతి చిత్రానికి సంగీత దర్శకుడు అయితే బాగుంటుందని దర్శకుడు మురుగదాస్ కి సూచించాడట. అంతేకాదు విజయ్ స్వయంగా థమన్ కి కాల్ చేసి తన సినిమాకి సంగీతం చేయాలని కోరినట్టు తెలుస్తోంది . నిజానికి థమన్ .తమిళంలో కొన్ని సినిమాలకి మ్యూజిక్ చేసినా కానీ పెద్ద గుర్తింపు రాలేదు .కానీ ఇప్పుడు ` అల వైకుంఠపురంలో` చిత్రం లోని తమన్ పాటలకి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. శిల్పా శెట్టి వంటి హిందీ సినీ తార , డేవిడ్ వార్నర్ వంటి ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ థమన్ పాటలకు టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండడంతో థమన్ ఖ్యాతి మరింత పెరిగింది. అలాటి అలౌకిక స్థితిలో ఉన్న థమన్ కి ఇళయదళపతి విజయ్ అఫర్ ఒక మంచి అవకాశం అనక తప్పదు .