Thama Movie Teaser Talk: నేషనల్ క్రష్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న రేష్మిక మందాన థామా సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పటి వరక్ ఆమె చేసిన పాన్ ఇండియా సినిమాలన్నీ గొప్ప గుర్తింపును సంపాదించుకున్నవే కావడం విశేషం… ఇప్పుడు థామా అనే ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాని చేస్తోంది. ఈ సినిమాలో తను మెయిన్ లీడ్ లో నటిస్తూ ఉండడమే కాకుండా సినిమా మొత్తాన్ని తన భుజాల మీద మోసే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే ఇందులో ఆయుష్మాన్ ఖురాన్, పరిష్ రావెల్, నవాజుద్దీన్ సిద్ధికి లాంటి దిగ్గజ నటులు నటిస్తుండటం విశేషం… రష్మిక మందన ఈ సినిమాకి కీలకంగా మారబోతోంది. అయితే ఈ సినిమా నుంచి కొద్దిసేపటికి క్రితమే టీజర్ అయితే రిలీజ్ చేశారు…ఇక ఈ సినిమాలో విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ మేకర్స్ కి ఏ మాత్రం తీసుపోకుండా దర్శకుడు ఆదిత్య సర్పద్తర్ విజువల్స్ ను నెక్స్ట్ లెవెల్ లో చిత్రీకరించాడు. ముఖ్యంగా ఆయన చేస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇండియాలోనే ది బెస్ట్ సినిమాగా మార్చాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వైల్డ్ అనిమల్స్ అలాగే ఫారెస్ట్ లో సాగే సన్నివేశాలను సైతం చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచినట్టుగా తెలుస్తోంది…మరి ఈ సినిమాతో రష్మిక మందాన మరోసారి తన పర్ఫామెన్స్ ను ఇచ్చి సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.
Also Read: పాన్ ఇండియా సినిమాలు తీయాలంటే ఈ నలుగురి వల్లే అవుతుందా..?
ఇక ఇప్పటివరకు బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడం లేదు. కానీ థామా టీజర్ చూస్తుంటే ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన సినిమాగా తెలుస్తోంది. సినిమా అనుకున్న రేంజ్ లో ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవుతోంది. లేకపోతే మాత్రం సినిమా డీలాపడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వచ్చినా కూడా కొంతమంది మాత్రం పాన్ ఇండియా పరిధిని దాటి సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు… ఇక రీసెంట్ టైమ్ లో రష్మిక మందన ఏ సినిమా చేసిన కూడా అది సూపర్ హిట్ గా నిలుస్తోంది. కాబట్టి సెంటిమెంటల్ గా చూసుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చాలామంది వాళ్ళ అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు…