Pan India films: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు సినిమా దర్శకులు భారీ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక నలుగురు దర్శకులు మాత్రమే పాన్ ఇండియా లను చేయగలరు అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం…అందులో ముగ్గురు తెలుగు సినిమా దర్శకులే కావడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. ఒక వీళ్ళు మాత్రమే పాన్ ఇండియాలో మంచి కాన్సెప్ట్ లతో సినిమాలను చేసి భారీ విజయాలను అందుకొని తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకోగలుగుతాడు అంటూ రాజమౌళి గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగ సైతం పాన్ ఇండియా ప్రేక్షకులను మెప్పించగలిగే స్క్రిప్ట్ లను తీసుకొచ్చి ఆ హీరోలకు మంచి విజయాలను అందించగలిగే కెపాసిటి తనకు ఉందని చెబుతుండడం విశేషం…ఇక సుకుమార్ లాంటి దర్శకుడు సైతం పుష్ప 2 సినిమాతో భారీ ప్రభంజనాన్ని సృష్టించాడు. ఆయనకు కూడా సినిమాలను ఎలా చేయాలి? ఎలా చేస్తే సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే ఒక ప్రణాళిక అయితే అతనికి తెలుసు అని చెబుతున్నారు. ఇక వీళ్ళు ముగ్గురు తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయికి తీసుకెళ్లడానికి కెపాసిటి ఉన్న దర్శకులను చెబుతూ ఉండటం విశేషం…
ఇక వీళ్ళతో పాటుగా కన్నడ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ సైతం పాన్ ఇండియా సినిమాని మీటర్ మీద చేసి కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులకు గుజ్ బంప్స్ తెప్పించే సన్నివేశాలను క్రియేట్ చేసి భారీ రేంజ్ లో కలెక్షన్స్ ను కొల్లగొట్టగలిగే కెపాసిటీ ఇతనికి ఉందని చాలామంది సినిమా విమర్శకులు సైతం చెబుతూ ఉండటం విశేషం…
Also Read: డీమన్ స్లేయర్ కిమెట్స్ నో యైబా – ఇన్ఫినిటి క్యాసిల్ ట్రైలర్ లో ఆ ఒక్కటి గమనించారా..?
మరి ఈ నలుగురు దర్శకులు ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నారు…వీళ్ళు చేయబోతున్న సినిమాలతో పాన్ ఇండియాలో 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ఆయా హీరోలకు భారీ మార్కెట్ ను క్రియేట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…
పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ సినిమాలను తీయగలిగే దర్శకులు ఇంకెవరు లేరని ఒకవేళ అడపాదడప ఎవరో ఒకరు సినిమాలను సక్సెస్ చేసినప్పటికి కంటిన్యూస్ గా సక్సెస్ లను సాధించే కెపాసిటి మాత్రం ఈ నలుగురికే ఉందని పలువురు విమర్శకులు సైతం చెబుతూ ఉండటం విశేషం…