Homeఎంటర్టైన్మెంట్Thaai Kizhavi Movie Review: 'తాయి కిజావి' మూవీ రివ్యూ : ఓటీటీ ఆడియన్స్ కచ్చితంగా...

Thaai Kizhavi Movie Review: ‘తాయి కిజావి’ మూవీ రివ్యూ : ఓటీటీ ఆడియన్స్ కచ్చితంగా చూడాల్సిన సినిమా..

Thaai Kizhavi Movie Review: కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు ఏ రేంజ్ లో బ్రహ్మరథం పడుతారో చెప్పడానికి మరో ఉదాహరణగా నిల్చిన చిత్రం ‘తాయి కిజావి’. సీనియర్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషించగా, తమిళ హీరో శివ కార్తికేయన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. కేవలం 10 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా , ఇప్పటి వరకు 83 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ , పైగా నేటి తరం తో సంబంధం లేని ఒక సీనియర్ హీరోయిన్ మూవీ ఇంత వసూళ్లను రాబట్టిందంటే , ఏ రేంజ్ కంటెంట్ సినిమా అనేది మీరే అర్థం చేసుకోండి. రీసెంట్ గానే ఈ చిత్రం జియో హాట్ స్టార్ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళం తో పాటు ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి ఉంది. మరి ఇప్పటి వరకు ఈ సినిమాని చూడని వాళ్ళ కోసం , రివ్యూ అందిస్తున్నాము చూడండి.

కథ :

పవనుతాయి (రాధికా శరత్ కుమార్) మంచి డబ్బు ఉన్న మహిళ. చూసేందుకు చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ , ఊర్లో ప్రతీ ఒక్కరికి ఆమె వడ్డీకి అప్పు ఇస్తుంది. కానీ ఇచ్చిన అప్పుని ముక్కు పిండి వడ్ఢేతో సహా వసూలు చేయడం ఆమె నైజం. ఆమె వడ్డీ డబ్బుల కోసం ఊర్లోని వీధుల్లోకి అడుగుపెడితే , అందరి హడిలిపోవాల్సిందే. అంత భయం అన్నమాట. అందుకే ఊర్లో ప్రతీ ఒక్కరు ఆమెకు చావు రావాలని కోరుకుంటూ ఉంటారు. వయస్సులో ఉన్నప్పుడే డబ్బు కోసం కట్టుకున్న భర్త కూడా తాయి ని వదిలేయడంతో , తన కూతురు బాగోగులు మాత్రమే కాకుండా, మనవడిని కూడా పెంచుతూ ఉంటుంది తాయి. అయితే ఒక రోజు తాయికి పక్షవాతం వస్తుంది. ఎంతలా అంటే ఆమె నోటి నుండి మాట కూడా రాలేనంత , కేవలం సైగలతోనే చెప్తుంది. అంతే కాకుండా, ఎక్కువసేపు స్పృహలో కూడా ఆమె ఉండలేదు. దీంతో ఆమె చనిపోవడం ఖాయమని అర్థం చేసుకున్న కొడుకులు , కోడళ్ళు, అల్లుడు ఊరికి వస్తారు. ఎవరికీ తెలియకుండా తాయి ఏకంగా 160 సవర్ల బంగారం దాచి పెట్టింది అనే రహస్యం కొడుకులకు తెలియడమే అందుకు కారణం. మరి బంగారం కోసం తాయి కొడుకులు ఏమి చేశారు?, బంగారాన్ని ఎలా కనిపెట్టారు?, ఈ సందర్భంగా వాళ్లకు ఎదురైనా సవాళ్లు ఏంటి అనేదే మూవీ స్టోరీ.

విశ్లేషణ :

ఈమధ్య కాలం లో వచ్చిన ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. పవనుతాయిగా రాధికా శరత్ కుమార్ అద్భుతంగా నటించింది. నవ్వించే సమయం లో నవ్వించింది, అదే విధంగా కన్నీళ్లు కూడా రప్పించింది. ఒక మంచి ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది ఈ చిత్రం. స్టోరీ వినగానే మీకు ప్రతి రోజు పండగే అనే సినిమా గుర్తుకు వచ్చే ఉంటుంది. కానీ సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ రాదు . ఎమోషన్స్ చాలా సహజం గా ఉండేలా తీర్చి దిద్దాడు ఆ చిత్ర డైరెక్టర్. తెలుగు లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది, ఒక మంచి ఎమోషనల్ మూవీ ని చూడాలని కోరుకునేవారు క్షణం కూడా ఆలోచించకుండ జియో హాట్ స్టార్ లో ఈ చిత్రాన్ని చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular