Bro Movie Extra Shows
Bro Movie Extra Shows: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యాయి. టీజర్ , పాటలు విడుదల అయ్యాయి. ఇప్పుడు అభిమానులు ట్రైలర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ ట్రైలర్ 21 వ తేదీన కానీ, లేదా 22 వ తేదీన కానీ వైజాగ్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ పర్యటనలు మొత్తం ముగించుకొని హైదరాబాద్ కి వచేసాడు. ఈరోజు సాయంత్రం నుండి ఆయన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నాడట. ముందుగా ట్రైలర్ కి సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చెయ్యబోతున్నట్టు సమాచారం. ఇక పోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. దర్శక నిర్మాతలు వరుసగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు.
కాసేపటి క్రితమే ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ మీడియా కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ ఆయన అభిమానులకు ఒక చేదు వార్త వినిపించాడు. అదేమిటి అంటే ఈ సినిమాని చాలా లిమిట్ బడ్జెట్ తోనే తీసాము కాబట్టి, మాకు ప్రత్యేకమైన టికెట్ హైక్స్ , మరియు అదనపు షోస్ అవసరం లేదు, అందుకే అప్లై చెయ్యలేదు అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి అభిమానుల గుండెలు బద్దలు అయిపోయాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి మొదటి రోజు రికార్డు లేకుండా ఉండదు.
ఎంత పెద్ద రీమేక్ అని ప్రచారం జరిగినా కూడా ప్రతీ సెంటర్ లో మొదటి రోజు రికార్డు పడుతుంది. అయితే ఈమధ్య ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎలాగో టికెట్ హైక్స్ ఇవ్వడం లేదు, దాని మీద అభిమానులు ఆశలు పెట్టుకోలేదు. కానీ తెలంగాణ లో మాత్రం టికెట్ హైక్స్ వస్తుందని ఆశపడ్డారు. ఇప్పుడు నిర్మాత ఇలా చెప్పడం తో ఇక రికార్డ్స్ పై ఆశలు వదిలేసుకున్నారు ఫ్యాన్స్.