Tere Ishk Mein Movie Collections: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) పేరు కచ్చితంగా ఉంటుంది. ఇతను కేవలం తమిళం లో మాత్రమే హీరో గా స్థిరపడాలని ఎప్పుడూ అనుకోలేదు. మంచి కథ తన వద్దకు వచ్చినప్పుడల్లా ఇతర భాషల్లో సినెమాలుచేస్తూనే ఉన్నాడు. మన తెలుగు లో కూడా ఈయన ‘సార్’, ‘కుబేర’ వంటి చిత్రాలు చేసి భారీ హిట్స్ ని అందుకున్నాడు. ఇక హిందీ లో అయితే పదేళ్ల క్రితమే ‘రంజానా’ అనే చిత్రం లో హీరో గా నటించిన అప్పట్లోనే వంద కోట్ల నెట్ సినిమాని అందుకున్నాడు. ఇప్పుడు అదే డైరెక్టర్ తో ‘తేరే ఇష్క్ మెయిన్'(Tere Ishq Main Movie) అనే సినిమా చేసాడు. AR రెహమాన్ అందించిన మ్యూజిక్ విడుదలకు ముందే పెద్ద హిట్ అవ్వడం తో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్లాయి.
అలా భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. టాక్ కి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా అదిరిపోయాయి. నిన్న ఉత్కంఠభరితమైన క్రికెట్ మ్యాచ్ జరిగినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడలేదు. మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి హిందీ వెర్షన్ వసూళ్లు ఎంత వచ్చాయో ఒకసారి చూద్దాం. మొదటి రోజు 15 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెండవ రోజున 16 కోట్ల 57 లక్షలు, మూడవ రోజున 19 కోట్ల 32 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి 51 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన నెట్ వసూళ్లు మాత్రమే.
ఓవర్సీస్ లో దాదాపుగా 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ మూడు రోజులకు వచ్చింది. అదే విధంగా తమిళ వెర్షన్ వసూళ్లు కేవలం 3 కోట్ల 40 లక్షల రూపాయిల వరకు వచ్చింది. ఓవరాల్ గా మూడు రోజులకు వరల్డ్ వైడ్ గా 70 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నెట్ వసూళ్లు దాదాపుగా 60 కోట్ల రూపాయిల వరకు ఉండొచ్చు. ఇదే రకమైన స్టడీ కలెక్షన్స్ ని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ వారం రణవీర్ సింగ్ హీరో గా నటించిన ‘దురంధర్’ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాపై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉన్నాయి. కాబట్టి ‘తేరే ఇష్క్ మెయిన్’ థియేటర్స్ తగ్గే అవకాశాలు ఉంటుంది.