Tera Kya Hoga Lovely Trailer: హీరోయిన్ ఇలియానా డిక్రూజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత ఈమెకు సినిమా ఆఫర్లు తక్కువ అయ్యాయి. కానీ మళ్లీ ఈమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే రీసెంట్ గా లేటెస్ట్ మూవీ తేరే క్యా హోగా లవ్లీ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ చేసిన ఇలియాన ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో కనిపించి అభిమానులను థ్రిల్ చేసింది.
అమ్మాయిల శరీర ఛాయ, వరకట్న సమస్య నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్ లో తెలుస్తోంది. సీరియస్ ఇష్యూపై ఎమోషనల్ డ్రామాగా దర్శకుడు బల్విందర్ సింగ్ జంబువా ఈ సినిమా తీసినట్టు కనబడుతోంది. శరీర ఛాయ కారణంగా సమకాలీన సమాజంలో ఓ యువతి ఎదుర్కొన్న ఇబ్బందులు, మానసిక సంఘర్ణణను స్క్రీన్ మీదకు తీసుకొచ్చారు. అలాగే కూతురికి పెళ్లి చేయడంలో తల్లిదండ్రులు ఎదుర్కొన్న ఇబ్బందులు, వరకట్న సమస్యను కూడా ఈ సినిమాలో చూపించారు.
డీ గ్లామర్ రోల్ లో ఇలియానా నటన ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇలియానాకు జోడీగా రణదీప్ హుడా నటించారు. సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన తేరా క్యా హోగా లవ్లీ మూవీ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. కరణ్ కుంద్రా, పవన్ మల్హోత్రా, గీతికా విద్య ఓహ్ లీయన్, రాజేంద్ర గుప్తా, అనిల్ రోధన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.