Telusu kada movie first review : ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ వంటి భారీ కమర్షియల్ హిట్స్ తో యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). కానీ ఈ రెండు సినిమాల తర్వాత విడుదలైన ‘జాక్’ చిత్రం ఎంతటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిందో మనమంతా చూసాము. ఈ సినిమా తర్వాత సిద్దు నుండి విడుదల అవ్వబోతున్న చిత్రం ‘తెలుసు కదా’. గతం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన నీరజ కోన ఈ చిత్రం ద్వారా మొట్టమొదటిసారి డైరెక్టర్ గా ఆడియన్స్ కి పరిచయం కాబోతుంది. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ ని చూస్తుంటే గజిబిజి గందరగోళం లాగా అనిపించింది. హీరో డీజే టిల్లు డైలాగ్ మాడ్యులేషన్ నుండి ఇంకా బయటకు రాలేదు. హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం మాత్రమే కనిపించింది కానీ, ఎక్కడా కథ అర్థం అవ్వలేదు.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది మీడియా ప్రముఖులకు వేసి చూపించారు. వాళ్ళ నుండి వచ్చిన రెస్పాన్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, సెకండ్ హాఫ్ కాస్త బోల్డ్ గా ఉంటుందని, ఆడియన్స్ ఆ బోల్డ్ సన్నివేశాలను ఎంత వరకు అంగీకరిస్తారు అనే దానిపైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ అంశంపైనే ఈ సినిమాని నీరజ కోన తెరకెక్కించిందని, మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు ఆడియన్స్ ని కాస్త కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా ఫలితం, ఈ చిత్రం తో పాటు విడుదల కాబోతున్న సినిమాల ఫలితాల మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
ఇక ఈ సినిమాకి ఉన్న మేజర్ హైలైట్స్ విషయానికి వస్తే థమన్ మ్యూజిక్ అని అంటున్నారు. ఆయన కంపోజ్ చేసిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలోని అనేక సన్నివేశాలను పైకి లేపింది అని అంటున్నారు. ఇక సిద్దు జొన్నలగడ్డ నటన ఈ సినిమాకు మరో హైలైట్ గా నిల్చిందట కానీ, అనేక సన్నివేశాల్లో టిల్లు షేడ్స్ వచ్చాయని అంటున్నారు. మరి ఆడియన్స్ దానిని సహిస్తారా లేదా అనేది చూడాలి. ఓవరాల్ గా ఈ చిత్రానికి యావరేజ్ రేంజ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఆడియన్స్ నుండి కూడా ఇలాంటి టాక్ వస్తుందో లేదో తెలియాలంటే మరో ఆరు రోజుల్లో తెలియనుంది.