Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హిస్టరీ లో అత్యంత అన్యాయమైన ఎలిమినేషన్ ని నిన్నటి ఎపిసోడ్ లో మనమంతా చూసాము. జనాల ఓటింగ్ ప్రకారం కాకుండా, హౌస్ లోని వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఓటింగ్ తో శ్రీజ ని ఎలిమినేట్ చేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. గత వారం డేంజర్ జోన్ లో ఉన్న డిమోన్ పవన్, రీతూ చౌదరి ఇద్దరూ కూడా సేవ్ అయ్యారు, మంచి ఓటింగ్ తో కొనసాగుతున్న శ్రీజ ని ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయం అనే చెప్పాలి. శ్రీజ ని ఇష్టపడని వాళ్ళు కూడా ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో వీడియోలు చేసి అప్లోడ్ చేస్తున్నారు. కచ్చితంగా ఆమె రీ ఎంట్రీ ఉంటుందేమో అని అంతా ఊహిస్తున్నారు కానీ, ఇప్పటికే ఆరు మంది వైల్డ్ కార్డ్స్ ఉన్నారు, హౌస్ లో 15 మంది ఉన్నారు కాబట్టి ఇక కొత్త రీ ఎంట్రీలు ఉండకపోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు.
ఇకపోతే నిన్న ఎలిమినేషన్ జరిగిన వెంటనే బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నది శ్రీజా. ఈ ఇంటర్వ్యూ లో శివాజీ అడిగిన అనేక ప్రశ్నలకు ఆమె తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చింది. ఎలిమినేషన్ పై నీ అభిప్రాయం ఏమిటి అంటి శివాజీ అడగ్గా, దానికి శ్రీజ సమాధానం చెప్తూ ‘ఎందుకో నాకు ఇది సరైన ఎలిమినేషన్ అనిపించలేదు. ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యుంటే పర్వాలేదు, అలా కాకుండా ఎవరో వైల్డ్ కార్డ్స్ వచ్చి నన్ను ఎలిమినేట్ చేయడం ఏంటో అర్థం కాలేదు. కానీ ప్రక్రియ లో భాగం కాబట్టి పర్వాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు సోషల్ మీడియా లో వేల సంఖ్యలో నెటిజెన్స్ శ్రీజ కి అన్యాయం జరిగింది అంటూ వేసిన పోస్టులను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. దీనిని బట్టీ చూస్తుంటే బిగ్ బాస్ నిర్ణయం పై ఆమె తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. ఒకే ఒక్క ఎపిసోడ్ తో ఈ సీజన్ తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకుంటుంది. మరి బిగ్ బాస్ తానూ చేసిన ఈ పొరపాటు ని సరిదిద్దుకొని శ్రీజ ని మళ్లీ బిగ్ బాస్ లోకి పంపుతారా లేదా అనేది చూడాలి.