Kantara The Chapter 1: మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కే కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం లేదు, యావరేజ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ అయిపోతాయి. అలాంటిది పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేసిన ఒక సినిమాకు సంబంధించిన ప్రీక్వెల్ కి ఏ రేంజ్ వసూళ్లు రావాలి?, ఆ సినిమాకు ఉన్న హైప్ కి కేవలం మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలి. కానీ ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. మేము చెప్తున్నది ‘కాంతారా: ది చాప్టర్ 1′(Kantara : The Chapter 1) చిత్రం గురించే. ప్రీమియర్ షోస్ పడిన రోజు ఈ చిత్రానికి వచ్చిన టాక్ ని చూసి కచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. కానీ కేవలం 700 కోట్ల గ్రాస్ వద్దనే ఈ చిత్రం ఆగిపోయింది.
ఇక ఎంత కలెక్షన్స్ వచ్చినా, ఈ మూడు రోజులు రావాల్సిందే, దాని తర్వాత థియేట్రికల్ రన్ ఉండడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాలి. ఈ సినిమాకు సంబంధించిన ఆంధ్ర ప్రదేశ్ థియేట్రికల్ రైట్స్ ని గీతా ఆర్ట్స్ సంస్థ కొనుగోలు చేయగా, తెలంగాణ థియేట్రికల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కొనుగోలు చేసింది. రెండు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 92 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఈ చిత్రానికి ఇప్పటి వరకు వచ్చిన వసూళ్లు 62 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే ఇంకా 28 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యమే. పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఒక సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక లో 195 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. నేటితో ఈ చిత్రం ఆ ప్రాంతం లో 200 కోట్ల మార్కుని అందుకోనుంది. ఇక్కడ మాత్రం ఈ చిత్రం కమర్షియల్ గా ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకుపోతుంది. అదే విధంగా తమిళనాడు లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాంబట్టలి. అదే విధంగా కేరళలో ఇప్పటి వరకు 49 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, బ్రేక్ ఈవెన్ కి మరో 30 కోట్లకు పైగా గ్రాస్ రావాలి. హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఈ చిత్రం భారీ నష్టాలనే మిగిలించింది. 300 కోట్ల గ్రాస్ కి సరిపడా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే 200 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇక ఓవర్సీస్ ఈ చిత్రానికి చావు దెబ్బ ఎదురు అయ్యిందనే చెప్పాలి. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.