Telusu Kada 1st Day Collections: టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) కి బ్యాడ్ టైం మొదలైంది. ఈ సిరీస్ తర్వాత ఆయన నుండి విడుదలైన ‘జాక్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. కనీసం పబ్లిసిటీ కోసం ఖర్చు చేసిన డబ్బులు కూడా ఆ చిత్రానికి రాలేదు. ఇక నిన్న విడుదలైన ‘తెలుసు కదా'(Telusu Kada Movie) చిత్రానికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం తో ఏకంగా 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఫుల్ రన్ లో రాబట్టిన హీరో సినిమాలకు కనీస స్థాయి ఓపెనింగ్స్ కూడా రాకపోవడం దురదృష్టకరం. జాక్ సినిమాకే దారుణమైన ఓపెనింగ్స్ అనుకుంటే, తెలుసు కదా చిత్రానికి అంతకంటే దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కేవలం 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
షేర్ అయితే కనీసం రెండు కోట్ల మార్కుని కూడా ముట్టుకోలేదు. ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని చూస్తే 23 కోట్ల రూపాయలకు పైగా జరిగిందట. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే, నైజాం ప్రాంతం లో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 18 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్ నుండి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సిద్దు లాంటి యూత్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరో కి ఇలాంటి కలెక్షన్స్ రావడం ఆశ్చర్యార్ధకం. మొత్తం మీద ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కోటి 33 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, రెండు కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ నుండి 45 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి కోటి 98 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మహా అయితే ఇంకో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావొచ్చు. ఓవరాల్ క్లోజింగ్ తిప్పి కొడితే 5 కోట్ల రూపాయిలు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. నిర్మాతకు 70 శాతం కి పైగా నష్టాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇలాంటి సినిమాలు చేసే బదులు సిద్దు సినిమాలు మానేయడమే మంచిది అని అంటున్నారు విశ్లేషకులు. సిద్దు అసలు డైరెక్టర్స్ మాట వినడని, కథ తల దూర్చి ఇష్టమొచ్చినట్టు మార్పులు చేర్పులు చేయడం వల్లే, వరుసగా రెండు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. తీరు మార్చుకోకుండా ఇక షెడ్డుకే అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.