Dude Movie 1st Day Collections: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్యూడ్'(Dude Movie) నిన్న భారీ అంచనాల నడుమ విడుదలై కాస్త డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఫస్ట్ హాఫ్ వరకు అద్భుతంగా ఉందని పాజిటివ్ టాక్ చెప్పారు కానీ, సెకండ్ హాఫ్ మాత్రం ఆర్య 2 చిత్రానికి జిరాక్స్ కాపీ లాగా ఉందని కామెంట్స్ వినిపించాయి. బుక్ మై షో లో కూడా రేటింగ్స్ బాగా పడిపోయాయి. కానీ ప్రదీప్ రంగనాథన్ మొదటి రెండు సినిమాలతో యూత్ ఆడియన్స్ లో క్రియేట్ చేసున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా, ఈ సినిమాకు అటు తమిళం లో, ఇటు తెలుగులో సెన్సేషనల్ ఓపెనింగ్స్ దక్కాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున 17 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ప్రదీప్ గత చిత్రం డ్రాగన్ కంటే రెండు రేట్లు ఎక్కువ ఓపెనింగ్ అంటున్నారు.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి రోజున తెలుగు రాష్ట్రాల నుండి 3 కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. షేర్ వసూళ్లు దాదాపుగా 2 కోట్ల 8 లక్షల వరకు ఉంటుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే మరో 8 కోట్ల 92 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు ఈ చిత్రానికి మొదటి రోజున 6 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 60 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ నుండి 6 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా 17 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, 8 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మొదటి రోజున వచ్చాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయలకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే కచ్చితంగా మరో 51 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే, మొదటి రోజు కంటే రెండవ రోజున అన్ని ప్రాంతాల్లోనూ ఎక్కువ వసూళ్లు నమోదు అవుతున్నాయి. గురువారం వరకు తమిళనాడు లో సెలవులు కాబట్టి, మొదటి వారం లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకా ఎంత పెద్ద రేంజ్ కి వెళ్తుంది అనేది.