Homeఎంటర్టైన్మెంట్Telugu TV Actress Maithili: వీడియో కాల్ చేసి మరీ టీవీ సీరియల్ నటి ఆత్మహత్యాయత్నం

Telugu TV Actress Maithili: వీడియో కాల్ చేసి మరీ టీవీ సీరియల్ నటి ఆత్మహత్యాయత్నం

Telugu TV actress Maithili: ఆమె ఓ సెలబ్రిటీ. సీరియళ్లలో బిజీగా ఉండే నటి. తన ప్రతిభతో దూసుకుపోతోంది. నిజజీవితంలో కూడా ఆమె సీరియల్ లాంటి కష్టాలే ఎదుర్కొంటోంది. ఆటుమగల మధ్య వచ్చిన విభేదాలతో జీవితంపై విరక్తి పెంచుకుంది. భర్తతో వేగలేక నూరేళ్ల జీవితానికి తెర వేయాలని భావించింది. దీంతో ఆమె చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఆత్మహత్య చేసుకునే ముందు పోలీసులకు వీడియో కాల్ చేసి మాట్లాడిది. ఇక తాను జీవించడం ఇష్టం లేక మరణించేందుకు సిద్ధమైనట్లు తెలిపింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను రక్షించి ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారు.

Telugu TV actress Maithili
Telugu TV actress Maithili

సీరియళ్లలో బిజీగా నటిస్తున్న మైథిలి వ్యక్తిగత జీవితం ఆమెకు ఓ నరకంలా కనిపిస్తోంది. భర్త తీరు వల్ల తీవ్ర వేదనకు గురైంది. భర్తతో భరించలేకపోతోంది. దీనిపై పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో ఆమె కలత చెందింది. బతుకుపై భరోసా కరువైంది. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకుని తప్పు చేశానని బాధ పడింది. తన జీవితభాగస్వామి చేసే పనులను తట్టుకోలేకపోయింది. అందుకే పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయింది.

Also Read: MLC Duvvada Srinivas- Atchannaidu: అచ్చెన్నాయుడును రోడ్లపై ఈడ్చి కొడతా.. ఎమ్మెల్సీ దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు

భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఎస్ఆర్ నగర్ లో నివాసం ఉండే వీరిలో కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మైథిలి మాట భర్త వినకపోవడంతోనే ఇద్దరి మధ్య తరచూ అభిప్రాయభేదాలు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఇద్దరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటున్నారు. పేరుకు భార్యాభర్తలు కానీ సంసారంలో మాత్రం నిత్యం తగాదాలే రావడంతో ఇద్దరు ఎవరికి వారే తమ పంతం నెరవేర్చుకోవాలని భావించడం సహజమే.

Telugu TV actress Maithili
Telugu TV actress Maithili

 

తాను కొనుగోలు చేసిన కారును కూడా అతడే వాడుకోవడం మొదలు పెట్టాడు. ఆమె ఎంత అడిగినా కారు ఆమెకు ఇవ్వలేదు. దీంతో మైథిలి తట్టుకోలేదు. కారును బలవంతంగా లాక్కోవడమే కాకుండా ఎంత అడిగినా ఇవ్వడం లేదు. దీనిపై ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో ఆమె జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని భావించుకుంది. దీంతో పోలీసులకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పడంతో వారు అలర్ట్ అయి ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఏం ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:KCR, Telangana Education System: తెలంగాణలో విద్యావ్యవస్థను కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలు కారణమేంటి?

Recommended Videos

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular