Telugu star producer cheated: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఉంది. అందులో కొంతమంది మోసాలకు పాల్పడుతుంటారు…అలాంటి వాళ్ళ మోసాల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ప్రయత్నం చేసినప్పటికి ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ నుంచే మోసాలు జరగడంతో ఎవ్వరిని నమ్మాలో ఎవ్వరిని నమ్మకూడదో అర్థం కానీ పరిస్థితైతే నెలకొంది. ఒక ప్రముఖ తెలుగు నిర్మాత ఒక ఓటిటి వ్యక్తితో కలిసి భారీ స్కాం ప్లాన్ చేశాడు. ఇంకా ఎట్టకేలకు ముంబైలోని ఓటీటీ కార్పొరేట్ సంస్థ వాళ్ళ మోసాలను గుర్తించి వాళ్లకు తగిన శిక్ష ను వేసే పనిలో ఉంది. ఇంతకీ ఆ నిర్మాత ఎవరు ఎలా మోసం చేశాడు అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక ప్రముఖ నిర్మాత గత మూడు సంవత్సరాల నుంచి దాదాపు నాలుగు సినిమాలను రిలీజ్ చేశాడు. వాటిలో ఏ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇక ఇదే సమయంలో ఆ ప్రముఖ నిర్మాత ఓటిటి సంస్థల మీద కన్నేశాడు. నిజానికి ఓటిటి సంస్థల హెడ్ ఆఫీస్ ఎక్కడో ఉన్నప్పటికి లోకల్ సినిమాలను తీసుకోవడానికి అక్కడే లోకల్లో ఉన్న కొంతమంది వ్యక్తులను వల్ల టీమ్ లో చేర్చుకుంటారు. వాళ్ల సలహా మేరకు ఏ సినిమాలను ఓటిటి సంస్థ కొనుగోలు చేయాలి. వాటిని ఎంత ధరకి కొనుగోలు చేయాలి అనేది నిర్ణయిస్తుంటారు. ఇక ఈ క్రమంలోనే ఓటిటి ప్లాట్ఫారంలో వర్క్ చేస్తున్న సగటు వ్యక్తి తో దగ్గర సంబంధం కలిగి ఉన్న ఈ ప్రముఖ నిర్మాత తన ఫ్లాప్ సినిమాలని ఎక్కువ రేట్ కి కొనుగోలు చేయిస్తే ఆ వచ్చిన ప్రాఫిట్ లో తనకి పర్సంటేజ్ రూపంలో కొంత అమౌంట్ ఇస్తానని ఒప్పుకున్నాడు.
దాంతో ఆ ఓటీటీ సంస్థలో పనిచేస్తున్నా వ్యక్తి డబ్బులకు ఆశపడి డిజాస్టర్ అయిన ఆ ప్రొడ్యూసర్ యొక్క సినిమాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయించాడు. దాంతో అటు ప్రొడ్యూసర్ సేఫ్ అయ్యాడు ఇటు ఆ వ్యక్తికి పర్సంటేజ్ రూపంలో చాలావరకు మనీ అయితే వెళ్ళింది. ఇక మొదట్లో ఈ విషయాన్ని పట్టించుకోని ఓటిటి యాజమాన్యం ఆ తర్వాత ఆరాధిస్తే వీళ్ళు చేసిన భారీ స్కామ్ బయటపడింది…
మొత్తానికైతే ఆ ప్రముఖ ప్రొడ్యూసర్ మీద ఓటీటీ సంస్థలో పనిచేసిన వ్యక్తి మీద ఓటిటి సంస్థ యాజమాన్యం భారీ చర్యలైతే తీసుకుంటుంది. మొదటి హెచ్చరికగా వాళ్ళు చేసిన స్కామ్ డబ్బులు ఎంతైతే ఉన్నాయి వాటిని చెల్లించాలని చెబుతోంది. అవి చెల్లించని పక్షాన వాళ్ళు లీగల్ గా వెళ్ళే అవకాశం ఉందని వాళ్లకు ముందస్తు హెచ్చరికలైతే జారీ చేశారు. ఇక దానికి తగ్గట్టుగానే ఈ ప్రముఖ నిర్మాత సంస్థలో పనిచేసిన వ్యక్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది తెలియాల్సి ఉంది…