Spirit Movie Villain: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద చెరగని ముద్ర వేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ… ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టాయి… ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక స్టార్ హీరోని తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి… ఇక అతను ఎవరు అనే విషయం మీద సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. మొత్తానికైతే ఈ సినిమాలో గోపీచంద్ ను విలన్ గా పరిచయం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…
ప్రభాస్ కి గోపిచంద్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తే గోపీచంద్ విలన్ గా చేసి మెప్పించాడు. ఇక అప్పటి నుంచి వీళ్ళ మధ్య చాలా మంచి బాండింగ్ కుదిరింది… అలా వీళ్ళిద్దరి మధ్య పెరిగిన అండర్స్టాండింగ్ తో ప్రభాస్ సినిమాలో మంచివి పాత్ర దొరుకితే చేయాలని గోపీచంద్ ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాడు.
ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా చేయడానికి తనకు కొంతవరకు ఇబ్బంది అనిపిస్తుందట. కానీ ప్రభాస్ తో సినిమా అంటే అది ఎలాంటి పాత్ర అయిన సరే నేను చేస్తానని గోపీచంద్ ఒకానొక సందర్భంలో చెప్పడం విశేషం… ఇక అందులో భాగంగానే ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రని సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేశారట. ఈ విషయాన్ని గోపిచంద్ తో చెబితే తను కూడా ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలైతే వస్తున్నాయి…
రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఆఫీస్ కి వెళ్ళిన గోపీచంద్ వాల్ పైన ఉన్న చిరంజీవి ఫోటోతో అలాగే సందీప్ రెడ్డి వంగ తో ఒక ఫోటో దిగాడు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అది విపరీతంగా వైరల్ అవుతోంది. మొత్తానికైతే స్పిరిట్ సినిమాలో గోపీచంద్ విలన్ గా చేస్తున్నాడా? లేదా అనే విషయం మీద సందీప్ తొందర్లోనే క్లారిటీ ఇస్తాడట…