https://oktelugu.com/

Tollywood: 40 ఏళ్లకు విడుదలైన స్టార్ హీరో సినిమా, థియేటర్స్ లోకి వచ్చే నాటికి ఈ లోకంలో లేడు! ఎవరా హీరో? ఏంటా చిత్రం?

పరిశ్రమను శాసించే స్థాయిలో ఉన్న ఒక హీరో మూవీ విడుదలకు నోచుకోలేదంటే నమ్ముతారా? ఆ మూవీ థియేటర్స్ లోకి రావడానికి ఏకంగా నాలుగు దశాబ్దాలు పట్టింది. ఇంతకీ ఏమిటా సినిమా? ఎవరా హీరో? ఇంట్రెస్టింగ్ డిటైల్స్..

Written By:
  • Dharma
  • , Updated On : January 7, 2025 / 10:57 AM IST

    Tollywood(4)

    Follow us on

    Tollywood: ఒక సినిమాను తెరకెక్కించడం, దాన్ని థియేటర్స్ లోకి తీసుకురావడం సులభమైన విషయం కాదు. అసలు ఒక సినిమా పూర్తయి థియేటర్స్ లోకి వచ్చే వరకు గ్యారంటీ ఉండదు. ముఖ్యంగా చాలా చిన్న సినిమాలు షూటింగ్ మధ్యలోనే ఆగిపోతాయి. కొన్ని విడుదలకు నోచుకోకుండా ఏళ్ల తరబడి బాక్సులకు పరిమితం అవుతాయి. మూవీ విడుదల కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఒక్కోసారి స్టార్ హీరోల చిత్రాలకు కూడా విడుదల కష్టాలు తప్పవు. ఎన్టీఆర్(NTR), ఏఎన్నార్(ANR) తెలుగు సినిమాకు రెండు కళ్ళు అంటారు. వారిద్దరూ దశాబ్దాల పాటు వెండితెరను ఏలారు.

    కాగా ఏఎన్నార్ నటించిన ఓ చిత్రం విడుదల కావడానికి ఏకంగా 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ గ్యాప్ లో మూడు తరాల హీరోలు పరిశ్రమకు వచ్చారు. ఏఎన్నార్ స్టార్డం పోయింది. చెప్పాలంటే ఆ మూవీ విడుదలయ్యే నాటికి ఏఎన్నార్ ఈ భూమ్మీద కూడా లేరు. ఆ సినిమా పేరు ప్రతిబింబాలు. అంత పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన ఏఎన్నార్ సినిమా విడుదల కాకపోవడం ఏమిటనే సందేహం మీకు రావచ్చు. వివరాల్లోకి వెళితే… దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు… ఏఎన్నార్, జయసుధ హీరో హీరోయిన్స్ గా ప్రతిబింబాలు టైటిల్ తో మూవీ ఆరంభించారు.

    Tollywood(5)

    ఈ సినిమాకు రాధాకృష్ణ జాగర్లమూడి నిర్మాత. ప్రతిబింబాలు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏఎన్నార్ గుండెపోటుకు గురయ్యారు. దాంతో ఆయనకు సర్జరీ జరిగింది. కోలుకుని తిరిగి సెట్స్ కి రావడానికి సమయం పట్టింది. అప్పట్లో జయసుధ బిజీ యాక్ట్రెస్. ఆమె కాల్ షీట్స్ దొరకలేదు. ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో సింగీతం శ్రీనివాసరావు తప్పుకున్నారు. దాంతో రాఘవేంద్రరావు తండ్రి కే ప్రకాశరావు ప్రతిబింబాలు మూవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రతిబింబాలు మూవీ పూర్తి అయ్యింది.

    ప్రాజెక్ట్ ఆలస్యం కావడం వలన ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మూవీని నిర్మాత రాధాకృష్ణ విడుదల చేయలేకపోయారు. అలా మరుగున పడిపోయిన ప్రతిబింబాలు చిత్రాన్ని 2022 నవంబర్ 5న ఏఎన్నార్ జయంతి సందర్భంగా 250కి పైగా థియేటర్స్ లో విడుదల చేశారు. కలర్ డీఐ చేయించి, ఆధునిక సౌండ్ సిస్టమ్ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రతిబింబాలు చిత్రాన్ని ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అదన్నమాట మేటర్..