Sivaji Movie: తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అప్పట్లో ఏ సినిమా చేసిన అదొక సంచలన విజయాన్ని అందుకునేది. ఇక రజనీకాంత్(Rajinikanth) హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన శివాజీ సినిమా తమిళం లో సూపర్ డూపర్ సక్సెస్ అయింది. ఇక అదే సినిమా తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ కూడా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రజినీకాంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ ఫ్రెండ్ గా రఘువరన్(Raghuvaran) నటించాడు.
అయితే ఈ సినిమాలో ఈ పాత్ర కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ పాత్రని తెలుగులో వేరే హీరోతో నటింపచేద్దామని రజనీకాంత్ అనుకున్నాడట. కానీ ఆ హీరో ఆ క్యారెక్టర్ లో చేయడానికి ఒప్పుకోలేదట. దాంతో రఘువరన్ చేసిన క్యారెక్టర్ కే తెలుగు డబ్బింగ్ చెప్పి తెలుగులో రిలీజ్ చేశారు. నిజానికి ఈ క్యారెక్టర్ లో రజనీకాంత్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన మోహన్ బాబుని తీసుకోవాలని అనుకున్నాడట. కేవలం తెలుగు వర్షన్ వరకే మోహన్ బాబుతో ఆ క్యారెక్టర్ ను చేయించాలని డిసైడ్ అయినప్పటికీ, ఆ క్యారెక్టర్ లో చేయడానికి మోహన్ బాబు పెద్దగా ఇష్టపడలేదంట. అది చిన్న క్యారెక్టర్ కావడం అలాగే మోహన్ బాబు దృష్టిలో దానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం వల్లే తను ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేశాడని అప్పట్లో మీడియా లో ఈ విషయం మీద చాలా కథనాలు అయితే వచ్చాయి.
ఇక సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయింది. అలాగే రఘువరన్ చేసిన క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడు మోహన్ బాబు ఆ క్యారెక్టర్ చేసిన బాగుండేది అని తన సన్నిహితుల దగ్గర తెలియజేసినట్టుగా కూడా వార్తలైతే వచ్చాయి. ఇక ఇది ఇలా ఉంటే మోహన్ బాబు రజనీకాంత్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పుడు మోహన్ బాబు సినిమాలు ఏమీ లేక ఖాళీగా ఉంటే, రజినీకాంత్ మాత్రం 70 సంవత్సరాల వయసులో కూడా వరుస సినిమాలను చేస్తూ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు…ఇక ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో సినిమాని చేస్తూ బిజీగా ఉన్నాడు…