https://oktelugu.com/

Lokesh Kanakaraj : లోకేష్ కనకరాజ్ స్ఫూర్తి తో వస్తున్న తెలుగు స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల… కాన్సెప్ట్ ఏంటి ఇంత కొత్తగా ఉంది…

ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలు ఓకెత్తయితే ఇక మీదట రాబోయే సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రి ని సైతం బీట్ చేస్తూ ముందుకు సాగుతున్న నేపధ్యం లో ఇప్పుడు వచ్చే కథలు ఎక్స్ట్రాడినరీ గా ఉండాల్సిన అవసరమైతే ఉంది...

Written By: , Updated On : February 20, 2025 / 08:12 AM IST
Lokesh Kanakaraj

Lokesh Kanakaraj

Follow us on

Lokesh Kanakaraj : సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) ఒకరు. కమల్ హాసన్ (Kamal Hasan) తో చేసిన ‘విక్రమ్’ (Vikram) సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో ఉన్న సినిమాలను చేయడంలో ఆయన సిద్ధహస్తుడు…ఇక ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన రజనీకాంత్ (Rajinikanth) తో కూలీ (kuli) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కూడా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కడం విశేషం…ఇక ఈ సినిమాలో నాగార్జున(Nagarjuna) విలన్ గా నటిస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో లోకేష్ కనకరాజు మరొకసారి తను భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇంతకుముందు విజయ్ (Vijay) తో చేసిన ‘ లియో’ (Leo)సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘దసర’ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు గ్యాంగ్ స్టర్ సినిమాని చేస్తున్నాడు. లోకేష్ కనకరాజు తెరకెక్కించిన విక్రమ్ సినిమా స్ఫూర్తితోనే ఆయన ఒక గ్యాంగ్ స్టర్ స్టోరీని రాసుకున్నారట. ప్రస్తుతం నాని తో చేస్తున్న ఈ సినిమా ‘ప్యారడైజ్ ‘ (Pardise)పేరుతో తెరకెక్కబోతుంది. తొందర్లోనే ఈ సినిమా రెగ్యూలర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో నాని శ్రీకాంత్ ఓదెల ఇద్దరికి మంచి గుర్తింపు వస్తుందంటూ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘దసర’ మూవీ మంచి విజయాన్ని సాధించింది. మరి మరోసారి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకుంటే నాని స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోతాడని అతను బాగా నమ్ముతున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా దసర, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాలతో మంచి విజయాలను అందుకున్న నాని ఇక మీదట వచ్చే సినిమాలతో కూడా మంచి విజయాలను సాధించాలని చూస్తున్నాడు.

అందుకే ఆచితూచి మరి ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు శైలేష్ కొలన్ చేస్తున్న హిట్టు 3 సినిమా కూడా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు… మరి నాని అంచనాలకు తగ్గట్టుగానే శ్రీకాంత్ ఓదెల మరోసారి అతనికి భారీ సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…