
సినిమాకి ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సింది విలువ, విషయం ఉన్న కంటెంట్. ఈ డిజిటల్ యుగంలో విలువ ఉన్నది కామెడీకే. అయితే విశ్వసనీయత, విషయం ఉన్న కామెడీ స్క్రిప్ట్ లను రాసే వారే లేకుండా పోయారు. ఎవరో ఒకరు రావాలి. సమస్యల వలయంలో బతుకు భయంతో బాధ పడుతున్న నేటి జనరేషన్ కి ఉపశమనం కలిగించే హాస్య బ్రహ్మ కోసం టాలీవుడ్ ఎదురు చూస్తోంది. కానీ జంధ్యాల మార్క్ కామెడీ మళ్ళీ వస్తోందా.. ఈవివి మాస్ కామెడీని క్రియేట్ చేసే విజన్ ఎవరికైనా ఉంటుందా ? రావాలని కోరుకోవడం తప్ప మనం ఏమి చేయగలం.
‘ఇఎస్ఐ’ విచారణలో జరిగేది ఇదేనా?
కానీ నిర్మాతలు చేయగలరు. కామెడీ రాసే శక్తి ఉన్నవారికి రెమ్యునరేషన్ ను అమాంతం పెంచాలి. మనం అందరం జబర్దస్త్ లో స్కిట్ లు చూసి బాగా ఎంజాయ్ చేస్తాం. అయితే ఆ స్కిట్ లో నటించే చివరి ఆర్టిస్ట్ సంపాధించే అంత కూడా ఆ స్కిట్ రైటర్ సంపాధించలేనప్పుడు ఎవరు మాత్రం ఎందుకు రైటర్ అవుతాడు. సినిమా అయినా, స్కిట్ అయినా, ఇంకేదైనా అది అందర్నీ మెప్పించాలంటే రైటర్ బాగా రాయాలి. రాసిన రైటర్ కి విలువ లేనప్పుడు విలువైన కామెడీని ఎలా ఆశించిగలం.
నిర్మాతలు దర్శకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవడం నేర్చుకోండి. రైటర్ లను తక్కువ చేసి.. తానూ గొప్ప అనిపించుకోవాలనుకునే దర్శకులు బతుకులు తలక్రిందులు అయిపోయిన సంఘటనలు మనం ఎన్ని చూడలేదు. స్క్రిప్ట్ కు రైటర్ కు విలువ ఇవ్వని నిర్మాతలు నష్టాల కష్టాలతో మొత్తం మునిగిపోయిన వాళ్ళు ఎంతోమందిని చూసి ఈ సినీ మా తల్లి ఎన్నిసార్లు నవ్వుకోలేదు. ఇప్పటికైనా రైటర్ కి తగిన గౌరవం ఇవ్వకపోతే భవిష్యత్తులో వారే దర్శకులు.. వారే నిర్మాతలు. ఎందుకంటే రాబోయే కాలం రైటర్స్ దే. ఎవడు గొప్పగా కామెడీ రాయగలడో వాడికే డిమాండ్ రాబోతోంది.