ఒకప్పుడు సామాజిక విపత్తులు వచ్చి సంక్షోభం ఏర్పడి నపుడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ముందుండి అందర్నీ నడిపించే వారు. కానీ ఆయన చనిపోయాక ఇండస్ట్రీ జనాలను ముందుకు నడిపేది ఎవరన్న ప్రశ్నకు ఇపుడు సమాధానం దొరికింది .
దేశ మంతా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ తెలుగు సినిమా రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి ఒక్కసారిగా అందరిలో కదలిక తేవడం జరిగింది. ఇప్పటికే ఇండస్ట్రీ జనాలకు చిన్న చిన్నసహాయాలు చేస్తూ..ఉన్నాడు. అందర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి ఫంక్షన్ లకు హాజరవుతూ , చిన్న వారిని దీవిస్తూ వచ్చాడు. నెమ్మదిగా టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా మారిపోయాడు.
ఇప్పుడు కరోనా వైరస్ ప్రజానీకం చేస్తున్న పోరులో సినీ పరిశ్రమను భాగస్వామిని చేసి ముందుకు నడిపిస్తున్నది కూడా చిరంజీవే కావడం విశేషం. చిరంజీవి చేస్తున్న ఈ మహత్ కార్యానికి మిగతా మెగా హీరోలు కూడా గొప్పగా తోడ్పాటు అందిస్తున్నారు.
కరోనా భాదితుల సహాయార్ధం అందరికన్నా ముందుగా పవన్ కళ్యాణ్ రూ.2 కోట్ల భారీ విరాళంతో కదలిక తెస్తే..దానికి చిరంజీవి స్పందిస్తూ సినీ కార్మికుల కోసం 1 కోటి రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది.
వెంటనే రామ్ చరణ్ తన వంతుగా ప్రభుత్వానికి రూ.70 లక్షలు , సినీ కార్మికుల కోసం ఇంకో రూ.30 లక్షల విరాళం ప్రకటించాడు. అలాగే అల్లు అర్జున్ రూ.1.25 కోట్ల భారీ విరాళం ప్రకటించాడు. వరుణ్ తేజ్ రూ.20 లక్షలిస్తే.. సాయిధరమ్ తేజ్ రెండు విడతలుగా రూ.10 పదేసి లక్షల చొప్పున 20 లక్షలు విరాళం ఇచ్చాడు.ఆ లెక్కన కేవలం మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు 5 కోట్ల 65 లక్షలు విరాళాలు పోగయ్యాయి.
కేవలం తాము విరాళాలు ఇవ్వడమే కాదు.. మిగతా వాళ్లను కూడా ఆ దిశగా నడిపించడంలో కూడా మెగా ఫామిలీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది . a stich in time saves nine