Telugu Movie: ఒక భాషలో హిట్ అయిన చిత్రం ఇతర భాషల్లోకి రీమేక్ కావడం సహజం. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా కథలు ఎగుమతి దిగుమతి అవుతుంటాయి. కొన్ని రీమేక్స్ అంతగా వర్క్ అవుట్ కాకపోవచ్చు. హిట్ సినిమా రీమేక్ చేస్తే హిట్ అవుతుందనే గ్యారంటీ లేదు. దానికి నేటివిటీతో పాటు, రిలీజ్ టైం, ఆడియన్స్ టేస్ట్ ఇలా అనేక అంశాలు కారణం అవుతాయి. కొన్ని సినిమాలు అన్ని భాషల్లో విజయం సాధిస్తాయి. మలయాళ చిత్రం దృశ్యం తెలుగుతో పాటు తమిళం, హిందీలో కూడా రీమేక్ అయ్యింది. ఇతర భాషల్లో కూడా హిట్ అందుకుంది.
మరో మలయాళ చిత్రం బాడీ గార్డ్ సైతం తెలుగు, హిందీ భాషల్లో రీమేక్ చేయగా హిట్ అందుకుంది. కాగా ఒక తెలుగు సినిమా ఏకంగా 10 భాషల్లో రీమేక్ చేశారు. ఇదో రికార్డు అని చెప్పొచ్చు. అది ఏ చిత్రం అంటే.. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా!. ప్రముఖ హీరో, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకుడిగా మారి చేసిన చిత్రం ఇది.
హీరో సిద్ధార్థ్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్. త్రిష హీరోయిన్ గా నటించగా… శ్రీహరి కీలక పాత్ర చేశారు. 2005లో విడుదలైన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా యువతను ఊపేసింది. లవ్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్ జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. హీరో సిద్ధార్థ్ కి తెలుగులో ఇమేజ్ తెచ్చిపెట్టింది. తెలుగులో ఆయనకు వరుస ఆఫర్స్ వచ్చాయి. త్రిష క్యూట్ నటనతో అద్భుతం చేసింది. ఆమె స్టార్ హీరోయిన్ గా అవతరించింది.
విదేశాల్లో లగ్జరీ లైఫ్ అనుభవించిన కోటీశ్వరుడైన కుర్రాడు ప్రేమ కోసం పల్లెటూరిలో పాలేరుగా మారతాడు. పందెం గెలిచి కోరుకున్న అమ్మాయిని సొంతం చేసుకుంటాడు. ఈ పాయింట్ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీ కొంచెం సల్మాన్ ఖాన్ ప్రేమ పావురాలు చిత్రానికి దగ్గరగా ఉంటుంది. కాగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అనేక భాషల్లో రీమేక్ చేశారు. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠి ఇలా… పది భాషల్లో రీమేక్ చేశారు. ఒక సినిమా ఇన్ని భాషల్లో రీమేక్ కావడం గొప్ప విషయం.
Web Title: Telugu movie remake in 10 languages
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com