Homeఎంటర్టైన్మెంట్Cinema Viral : 'అన్‌స్టాపబుల్' సక్సెస్ కి కారణం ఆమె.. ...

Cinema Viral : ‘అన్‌స్టాపబుల్’ సక్సెస్ కి కారణం ఆమె.. సుమన్ దాతృత్వ గుణం వైరల్ !

Cinema Gossips: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ షో సక్సెస్ వెనుక బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నందమూరి కష్టం కూడా ఉందని షో రైటర్ మచ్చ రవి తెలిపారు. షోలో బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని చెప్పారు. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు […]

Cinema Gossips: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ షో సక్సెస్ వెనుక బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నందమూరి కష్టం కూడా ఉందని షో రైటర్ మచ్చ రవి తెలిపారు. షోలో బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని చెప్పారు. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

NBK Unstoppable With Mahesh
NBK Unstoppable With Mahesh

అలాగే మరో క్రేజీ అప్ డేట్ విషయానికి వస్తే.. సీనియర్ హీరో సుమన్ తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. భారత సైన్యం కోసం యాదాద్రి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న తన 117 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. అయితే, చెన్నై నుంచి తరచుగా హైదరాబాద్ ప్రయాణించే క్రమంలో కొన్ని పత్రాలు గల్లంతయ్యాయని, డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా ఆ భూములపై కోర్టులో కేసు కొనసాగుతోందని సుమన్ అప్పట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో, తాజాగా భూములను సైన్యానికి అందజేసినట్టు తెలుస్తోంది.

Also Read: టాలీవుడ్ జనవరి రివ్యూ : తొలి నెల‌లోని సినిమాలన్నీ విల‌విల‌ !

 

suman
suman

 

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. యంగ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన తండ్రి కలను నిజం చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసిన విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. లగ్జరీ కారు కొనుగోలు చేయాలన్నది నా తండ్రి 45 ఏళ్ల కల అని తెలిపింది. ఈ కల సాకారం చేసుకునే విధంగా కొత్త మెర్సిడెజ్ బెంజ్ ఈ-క్లాస్ మోడల్ కారు కొనుగోలు చేశానని చెప్పింది.

Sakshi Agarwal
Sakshi Agarwal

Also Read:  టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper