Telugu Heroes Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు చాలామంది హీరోలు తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో వాళ్ల పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే చాలామంది స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా బాట పడుతున్నారు. ఇక ఇప్పటికే టైర్ వన్ హీరోలందరు పాన్ ఇండియాలో తమ సత్తా చూపించినప్పటికి యంగ్ హీరోలు సైతం అదే బాటలో నడుస్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. మన హీరోలందరు ఒక్క సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు అవుతున్నాయంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
ఇక టైర్ వన్ హీరోల విషయానికొస్తే ప్రస్తుతం ప్రభాస్ 250 కోట్లకు పైన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అల్లు అర్జున్ సైతం 200 కోట్లకు పైన రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుండటం విశేషం… ఇక రామ్ చరణ్ 180 నుంచి 200 కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ 150 కోట్లు, పవన్ కళ్యాణ్ 100 కోట్లు, మహేష్ బాబు 150 కోట్ల వరకు తీసుకుంటున్నారు.
ఇక వీళ్లందరివి కలిపితేనే దాదాపు 1000 కోట్ల వరకు అవుతున్నాయి… ఇక సీనియర్ హీరోలు సైతం ఒక్క సినిమా కోసం దాదాపు 50 కోట్లకు పైన రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇక వీళ్ళందరివి కలిపిన 200 కోట్ల వరకు అవుతున్నాయి… నాని, విజయ్ దేవరకొండ, శర్వానంద్, తేజ సజ్జా, రామ్, నాగ చైతన్య లాంటి నటులు సైతం 40 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు…
ఇలా వీళ్ళందరివి కలిపితే 2000 కోట్ల వరకు అవుతున్నాయి… వీళ్ళందరూ ఒక్క సినిమా రెమ్యునరేషన్ ను సినిమా ఇండస్ట్రీ ని డెవలప్ చేయడానికి వాడితే ఇండస్ట్రీ అద్భుతంగా తయారవుతుంది అని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…చూడాలి మరి వీళ్ళందరు ఆ దిశగా అడుగులు వేస్తారా లేదా అనేది…