National Awards: ‘నేషనల్ అవార్డు’ లను అందుకున్న ఈ తమిళ్ హీరోలకంటే మనవాళ్ళకి ఏం తక్కువ…

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరూ కమర్షియల్ సక్సెస్ ల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయితేనే ఆ హీరోల క్రేజ్ గాని, వాళ్ళ మార్కెట్ గాని పెరుగుతుంది. తద్వారా వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరిగే అవకాశాలైతే ఉంటాయి...

Written By: Gopi, Updated On : July 31, 2024 6:51 pm
Follow us on

National Awards :  తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ‘నేషనల్ అవార్డులను’ అందుకుంటున్నారు. మరి వాళ్ళు మాత్రమే ఎందుకు ఆ అవార్డులను అందుకుంటున్నారు. మన హీరోలు ఎందుకు ఆ రకంగా ముందడుగు వేయడం లేదు అనే విషయం మీదనే చాలా రోజుల నుంచి కొన్ని చర్చలైతే నడుస్తున్నాయి. ఇక నిజానికి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నలుగురు స్టార్ హీరోలు ఇప్పటివరకు చాలా అవార్డులను అందుకున్నారు. అందులో ముఖ్యంగా కమల్ హాసన్ గురించి మనం చెప్పుకోవాలి. ఆయన ఇప్పటివరకు మూడుసార్లు నేషనల్ అవార్డులను అందుకున్నాడు. ఆయన ఎంచుకునే సబ్జెక్టులోనే కొత్తదనం ఉంటుంది. కాబట్టి ఆ సినిమాలో ఆయన చేసే యాక్టింగ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అందువల్లే ఆయన యాక్టింగ్ ని చూసిన ప్రతి ఒక్కరు తన నటనకు ఫిదా అయిపోతారు. దానివల్ల తనను వెతుక్కుంటూ అవార్డులు వాటంతట అవే వస్తాయి. కమల్ హాసన్ తర్వాత ధనుష్ కూడా చాలా సింపుల్ గా ఉంటూనే ఒక చిన్న పాయింట్ తో సినిమా చేసి అందరిని మెప్పించే ప్రయత్నం చేస్తాడు. అతను కూడా చాలా వరకు తన పూర్తి ఎఫర్ట్ ను పెట్టి ఆ క్యారెక్టర్ కి జీవం పోస్తాడు. కాబట్టి ఆయనకి కూడా ఇప్పటివరకు రెండుసార్లు నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి… ఇక వీళ్లిద్దరితో పాటుగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉంటూ కేవలం ఎక్స్పరిమెంటల్ సినిమాలను మాత్రమే చేయగలిగే హీరో విక్రమ్… ఈయన కూడా తన ఎంటైర్ కెరియర్ లో ఒకసారి నేషనల్ అవార్డు ను సాధించాడు..ఇక సూర్య లాంటి హీరో కూడా ఒక నేషనల్ అవార్డును దక్కించుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.

ఇక ఇప్పటివరకు ఆయన చాలా వైవిధ్యమైన పాత్రలని పోషిస్తూ అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ఇటు కళాత్మకమైన సినిమాలను కూడా చేస్తూన్నాడు. ఇక రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేయడంలో సూర్యని మించిన వారు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక ఇప్పుడు ఈ నలుగురు హీరోల మాదిరిగా మన హీరోలకి అవార్డులు ఎందుకు రావడం లేదు అనే దాని మీదనే చర్చ నడుస్తుంది. ఇక రీసెంట్ గా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డుని అందుకున్నాడు.

అయినప్పటికీ ఎంటైర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క హీరోకి నేషనల్ అవార్డు రావడం అనేది నిజంగా సిగ్గుచేటనే చెప్పాలి… ఇక తమిళ్ సినిమా హీరోల కంటే మన హీరోలేం తక్కువ కాదు. కానీ వాళ్ళు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉండటంతో వాళ్లు కొంచెం యాక్టింగ్ చేసిన కూడా అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇక మన హీరోలు కమర్షియల్ సినిమాలను చేయడం వల్ల అందులో కొత్తగా యాక్టింగ్ చేద్దామన్నా కూడా స్కోప్ అయితే ఉండటం లేదు.

కాబట్టి వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ని చూపించే సమయం రావడం లేదు.అందువల్ల మన హీరోలు ఇక మీదట కొన్ని మంచి సినిమాలు, కొన్ని కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తేనే అటు సినిమాలు సక్సెస్ అవ్వడంతో పాటుగా చాలా అవార్డులు కూడా వస్తాయి. దీనివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉత్తమమైన నటులు ఉన్నారు అంటూ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది…