Chandrababu And Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలను మనమంతా చూసాము. సింగిల్ థియేటర్స్ ని కమీషన్ బేసిస్ లో నడపాలని, లేకపోతే థియేటర్స్ మూసి వేస్తామంటూ ఎగ్జిబిటర్స్ మీటింగ్ పెట్టుకోవడం, దీనికి వెనుక ఆ నలుగురు ఉన్నారంటూ ప్రచారం జరగడం, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఈ విషయం తెలియడంతో సరిగ్గా నా సినిమా వచ్చేటప్పుడే ఇలా చేస్తారా అని కోపం తెచ్చుకోవడం, ఇక నుండి ప్రభుత్వాన్ని నేరుగా కలవడానికి ఎలాంటి అనుమతి లేదని, ఫిలిం ఛాంబర్ ద్వారానే సంప్రదించాలని పవన్ కళ్యాణ్ అల్టిమేటం జారీ చేయడం వంటివి ఎంతటి సంచలనం రేపాయో మన అందరికి తెలిసిందే. అంతే కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ని ఇండస్ట్రీ పెద్దలు కలవలేదని పవన్ కళ్యాణ్ చాలా ఫైర్ అయ్యాడు.
దీనిపై నిర్మాత దిల్ రాజు(Dil Raju), అల్లు అరవింద్(Allu Aravind) వంటి వారు కూడా స్పందించడం జరిగింది. మేము ఎన్నో సార్లు ప్రయత్నం చేశాము, కానీ అందరూ ఒక తాటి పైకి రాకపోవడం వల్లే మేము కూడా ఏమి చేయలేకపోయాము అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడు సినీ పెద్దలంతా సీఎం చంద్రబాబు నాయుడు ని కలవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్ష్యంలో ఈ నెల 14న (ఆదివారం) సినీ పెద్దలు సచివాలయం లో సీఎం చంద్రబాబు తో భేటీ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సుమారుగా 30 మందికి పైగా ఈ భేటీ లో హాజరు కాబోతున్నారట. అందులో టాలీవుడ్ టాప్ నిర్మాతలతో పాటు పలువురు టాప్ హీరోలు కూడా ఉంటారని తెలుస్తుంది. నేటి తరం పాన్ ఇండియన్ హీరోలలో ఒకరు కూడా ఈ భేటీ లో పాలు పంచుకోబోతున్నారట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ప్రత్యేకంగా సన్మానం కూడా చేస్తారట. వాస్తవానికి ఇది ఎప్పుడో జరగాల్సింది. కానీ నిర్మాతల అలసత్వం వల్ల ఇంత ఆలస్యం అయ్యిందని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే టికెట్ రేట్స్ విషయం లో ఇకపై ఒకప్పుడు ఉన్నటువంటి ఫ్రీ గ్రౌండ్ ఇప్పుడు ఉండదని స్పష్టంగా అర్థం అవుతుంది. ఎంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా నిర్మాత అయినా ఫిలిం ఛాంబర్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తు చేసుకున్న బడ్జెట్ లెక్కలు అన్నీ పరిగణలోకి తీసుకొని , ఎంత టికెట్ రేట్ పెంచితే నిర్మాతకు లాభదాయకంగా ఉంటుందో అంతే పెంచుతారట. అంతే కాకుండా ఇక పై థియేటర్స్ లో దొరికే కూల్ డ్రింక్స్, పాప్ కార్న్ రేట్స్ ని కూడా అదుపులోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించామని పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే అధికారులను ఆదేశించారు. అధికారులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ లో తనిఖీలు నిర్వహించడం ఈమధ్య కాలం లో జరిగింది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.