హీరోయిన్ అవ్వాలని ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి ఆశ పడటంలో తప్పేం ఉంది. అందం ఉంది, కాకపోతే, చెప్పుకోతగ్గ అభినయం లేకపోయినా, అసలు అభినయం అంటేనే తెలియని బ్యూటీలు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నప్పుడు తనకేం తక్కువ ?, ఆ మాటకొస్తే వెబ్ సిరీస్ కోసమే తానూ ఘాటు లిప్ కిస్ లు ఇచ్చింది. ఏ.. ఇక సినిమా కోసం ఆ మాత్రం ఎక్స్ పోజింగ్ దాటలేనా ఏంటి ? దాటుతాను, ఎలాంటి పాత్ర అయినా చేస్తాను అంటుంది తెలుగు బిడ్డ చాందినీ చౌదరి.
పాపం తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి ఇప్పటికే ఏడేళ్లైంది. ఛాన్స్ లు ఇస్తామని అఫీస్ లకు పిలిచి అవమానించి పంపించినోళ్లు ఉన్నారు. ఎన్నో అవమానాలు, మరెన్నో సమస్యలు.. అన్నిటినీ ఎదుర్కొంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కెరీర్ లో పైకి మాత్రం రాలేకపోతుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో అర్ధం కావట్లేదని తెగ ఫీల్ అయిపోతుంది.
అయితే, తెలిసినవాళ్ళ అభిప్రాయం ప్రకారం కెరీర్ బిగినింగ్ లోనే సక్సెస్ వచ్చి ఉంటే, మంచి అవకాశాలు వచ్చేవి. పైగా చేసిన ప్రతి సినిమా భారీ ప్లాప్ సినిమాగా నిలిచింది. ఎన్నో అంచనాలతో చేసిన ‘మను’ సినిమా కూడా ఆమెకు బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది. మరి కథల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన టైంలో రాంగ్ స్టెప్స్ వేసింది చాందిని.
ఇప్పుడు ఇక ఓటీటీ సినిమాలు చేసుకుంటూ కాలం గడుపుతుంది. మరి ఈ తెలుగు బ్యూటీ డిజిటల్ నుంచి సిల్వర్ స్క్రీన్ పైకి ఎప్పుడు అడుగుపెడుతుంది ? అసలు ఇప్పటినుండి అయినా కెరీర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతుందా ? లేక డిజిటల్ హీరోయిన్ గానే కేవలం వెబ్ సిరీస్ లకే పరిమితం అవుతుందా ? చూడాలి. ఏది ఏమైనా పరిశ్రమలో బ్యాక్ గ్రౌండ్, గాడ్ ఫాదర్ లేకపోతే రాణించడం కష్టమే.