https://oktelugu.com/

Naga Chaitanya- Sai Pallavi: చైతు ప్లాట్ లో అడ్డంగా దొరికిన ‘సాయి పల్లవి’

Naga Chaitanya- Sai Pallavi: నాగ‌చైత‌న్య త్వరలోనే మళ్లీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా మధ్యమధ్యలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, గతంలోనే ఈ రూమర్ల పై మేం క్లారిటీ ఇచ్చాం. పైగా తనకు కాబోయే కొత్త సతీమణి కోసమే చైతు జూబ్లిహిల్స్ లో ఓ కొత్త విల్లా కూడా తీసుకున్నాడని, ఆ ఇంటి పునరుద్దరణ పనులను జయభేరీ సంస్థ చేస్తోందని, ఇక చైతు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ఆమె కూడా ఒక […]

Written By:
  • Shiva
  • , Updated On : April 20, 2022 / 12:26 PM IST
    Follow us on

    Naga Chaitanya- Sai Pallavi: నాగ‌చైత‌న్య త్వరలోనే మళ్లీ ఓ ఇంటివాడు కాబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా మధ్యమధ్యలో రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, గతంలోనే ఈ రూమర్ల పై మేం క్లారిటీ ఇచ్చాం. పైగా తనకు కాబోయే కొత్త సతీమణి కోసమే చైతు జూబ్లిహిల్స్ లో ఓ కొత్త విల్లా కూడా తీసుకున్నాడని, ఆ ఇంటి పునరుద్దరణ పనులను జయభేరీ సంస్థ చేస్తోందని, ఇక చైతు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ఆమె కూడా ఒక హీరోయినే అని మేము మూడు నెలల క్రితమే స్పష్టం చేశాము.

    Naga Chaitanya- Sai Pallavi

    ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? అనే వార్త పై మీ కోసం ఎక్స్ క్లూజివ్ అప్ డేట్. చైతు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ ‘సాయి పల్లవి’. సాయి పల్లవి షూట్ ఉంటేనే హైదరాబాద్ వస్తుంది. కానీ.. ఆమె గత కొన్ని నెలలుగా పూర్తిగా హైదరాబాద్ కే పరిమితం అయిపోయింది. పైగా చైతు ప్లాట్ లోనే ఉంటుంది. ఆమెను అక్కడ చూసిన ఓ యంగ్ డైరెక్టర్ ఈ వార్తను ఇండస్ట్రీ మొత్తానికి ఊదాడు.

    Also Read: Tv Anchors: బుల్లితెర స్టార్ యాంకర్ల రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

    ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ సమయం నుంచే సాయి పల్లవితో చైతు చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. సమంతతో విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం. వీరి విషయం సమంతకు తెలిసినప్పటి నుంచే.. చైతు – సామ్ మధ్య విబేధాలు వచ్చాయి. నిజానికి చైతు – సామ్ ఘాడంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

    పెళ్లి తర్వాత క్రేజీ కపుల్ గా టాలీవుడ్ లో ఇద్దరికీ మంచి గుర్తింపు కూడా దక్కింది. పైగా పెళ్లి తర్వాత ఇద్ద‌రి కెరీర్లూ వరుస సక్సెస్ ట్రాక్ లో పడ్డాయి. అయినా ఈ జంట‌ విడాకులు తీసుకోవడం బాధాకరమైన విషయం.

    Naga Chaitanya- Sai Pallavi

    ఇప్పుడు చైతుతో సాయి పల్లవి ప్రేమాయణం నడుస్తోంది. మరి ఈ జంట అయినా ఎక్కువ కాలం కలిసి ఉండాలని ఆశిద్దాం. సమంతతో విడాకులు అధికారికంగా వచ్చాక.. చైతు ‘సాయి పల్లవి’ని వివాహమాడనున్నాడు. నవంబర్ సెకండ్ వీక్ లో ఈ పెళ్లి ఉండే అవకాశం ఉంది. అందుకే.. సాయి పల్లవి కొత్త సినిమాలను పెద్దగా అంగీకరించడం లేదు.

    Also Read:Dil Raju: ట్రెండింగ్ లోకి ‘దిల్ రాజు’ భార్య.. ఆ పిక్ వల్లే !

    Recommended Videos:

    Tags