Dil Movie: 2003లో నితిన్ హీరోగా నేహా హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా దిల్. ఈ సినిమాతోనే రాజు నిర్మాతగా మారారు. అప్పటి నుంచి ఆయన పేరు దిల్ రాజు గా మారింది. దీనికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. నితిన్ కెరీర్ ను మలుపు తిప్పింది. అప్పుడే హీరోగా తన ప్రస్థానం నిలబెట్టుకున్నాడు.
ఈ సినిమాలో నటించిన వారు ఐదుగురు మరణించడమే విచారకరం. అందరిని అలరించే నటుల్లోవీరుండటం గమనార్హం. అందరు మంచి నటులే. దీంతో సినిమాకు వారే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆద్యంతం ఆకట్టుకునే నటనతో మెప్పించిన వారు మన మధ్య లేరంటే అది పెద్ద లోటే. కానీ ఐదుగురు లేకుండా పోవడమే గమనార్హం.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న చలపతి రావు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. ఆయన ఈ సినిమాలో హీరో తండ్రిగా అద్భుతంగా నటించారు. కానీ ఆయన అకాల మరణం చెందడం బాధాకరం. ఇక చలపతి రావు తనయుడు రవిబాబు ప్రస్తుతం దర్శకుడుగా నటుడిగా చేస్తున్నాడు. ఆయన లేని లోటు తీర్చలేనిది.
మరో కమెడియన్ వేణుమాధవ్ హీరో మావయ్యగా నటించాడు. ఆయన కూడా మన మధ్య లేకపోవడం విచారకరమే. ఈ సినిమాలో వేణుమాధవ్ నితిన్ కు తోడుగా క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. మరో కమెడియన్ ఎంఎస్ నారాయణ ఈ సినిమాలో లెక్చరర్ గా నటించారు. తనదైన నటనతో ఆకట్టుకున్నారు. నవ్వుల పువ్వులు పూయించడంలో ఆయనకాయనే సాటి.
మరో విలన్ పాత్రలు చేసే రాజన్ పి. దేవ్ కూడా ఇందులో హీరోయిన్ తాతగా నటించాడు. అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఆహుతి ప్రసాద్ కూడా మనకు కనిపించకుండా పోయారు. ఆయన కూడా తనదైన నటనతో మెప్పిస్తారు. పాత్రలో లీనమైపోతారు. ఇలా ఈ సినిమాలో నటించిన ఐదుగురు నటులు గతించి పోవడం బాధాకరం.