Nagineedu: సినిమా పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా నటించిన హీరో ,హీరోయిన్ , విలన్ వీరికి తర్వాత సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ లభిస్తాయి. ఒకసారి సూపర్ హిట్ అయిన సినిమాలో నటించిన ఆ తర్వాత నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే వారికి అవకాశాలు రావడం గగనం అనే చెప్పాలి. అలాంటి విషయాన్ని ఒక షో సందర్భంగా తెలియజేశారు మర్యాద రామన్న విలన్ నాగినీడు. మర్యాద రామన్న ,మిర్చి,ఇష్క్,గబ్బర్ సింగ్, రభస, బెంగాల్ టైగర్ వంటి స్టార్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులు మంచి గుర్తింపు పొందారు. అయితే తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటించారు నాగినీడు. ఆలీ హోస్ట్‌గా ఈటీవీ లో ప్రసారమవుతున్న “ఆలీతో సరదాగా” షో కి అతిథిగా వచ్చి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

నాగినీడు మాట్లాడుతూ….. మర్యాద రామన్న సినిమా నన్ను ఓ స్థాయిలో నిలబెట్టింది కానీ అదే నాకు మైనస్ అయ్యింది అని చెప్పుకొచ్చారు. సినిమాల్లో ఏదైనా పాత్ర కోసం ఏ దర్శకుడినైనా సంప్రదిస్తే నాగినీడు గారు మీరు మాత్రమే న్యాయం చేయగలరు అనే పాత్ర ఉంటే మీకు ఇస్తాం మిమ్నల్ని సాధారణ పాత్రల్లో ఊహించుకోలేం కదా అటువంటి క్యారెక్టర్ ఉంటే చెప్తామని చెప్పేవారు. నేను మనసులో అనుకునేవాడిని ఇవన్నీ ఎందుకు డబ్బొస్తే చాలు అని అనుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చారు ఇంతలో ఆలీ ఓ దర్శకుడు మీద సీరియస్ అయ్యారు అంట. అని అడగగా అవును అంటూ ప్రోమో ముగిసిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ ఇండియా లో వైరల్ అవుతుంది.