Special Ops 2 Review: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఈమధ్య వెబ్ సిరీస్ లకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ అయితే లభిస్తోంది. ఓటిటి ప్లాట్ ఫామ్ ఎప్పుడైతే ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చిందో అప్పటినుంచి ప్రేక్షకులందరు కూడా సిరీస్ లను చూస్తూ ఆనందించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా వెబ్సైట్ లకు మంచి ఆదరణ అయితే లభిస్తోంది. ఇక ఇంతకుముందు ఓపీఎస్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన రాబట్టింది. ఇక దీని తర్వాత ఒపీఎస్ ది హిమ్మత్ స్టోరీ 1.5 కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఓపిఎస్ 2 వెబ్ సిరీస్ అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది సగటు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే సైబర్ క్రైమ్ నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటున్న హిమ్మత్ సింగ్ ఆయన టీం ఏఐ ద్వారా వాళ్ళకి ఎదురైన ప్రాబ్లమ్స్ ను ఎలా ఎదుర్కొన్నారు. వాటికి ఎలా చెక్ పెట్టారు వాళ్ల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని కనుగొన్నారా? లేదా అనే విషయం తెలియాలంటే మీరు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ను మీరు చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు మొదటి ఎపిసోడ్ నుంచి కూడా తను అనుకున్న పాయింట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేసి ముందుకు నడిపించాడు. ముఖ్యంగా సైబర్ క్రైమ్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. సగటు జనాలు ఈ రోజులలో ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది ముందుగా మనకు చూపించి వాటి వల్ల స్పెషల్ ఆఫీసర్స్ సైతం వాటిని ఎదుర్కోవడంలో ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు.
వాళ్లకున్న అడ్డంకులు ఏంటి అనే విషయాన్ని చర్చించాడు. ఇక దర్శకుడు తను ఏదైతే కాన్సెప్ట్ అనుకున్నాడో దానిని ఏమాత్రం డివియేషన్స్ లేకుండా స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు…ఇక మొదటి ఎపిసోడ్ నుంచి ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ రికెత్తిస్తూ ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేశాడు.
ముఖ్యంగా మూడో ఎపిసోడ్ కొంతవరకు డల్ అయినప్పటికి చివరి ఎపిసోడ్ లో మాత్రం హై లెవెల్ కి తీసుకెల్లడనే చెప్పాలి… యాక్షన్ బ్లాక్స్ సైతం సినిమా మీద హైప్ ని పెంచేస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్, మధ్యలో వచ్చే ఎలివేషన్స్ సీన్స్ సైతం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే తాహిర్ రాజ్ భాసిన్ చాలా చక్కటి నటనను కనబరిచాడు. ఆయన నటనలోని వేరియేషన్స్ బాగా సెట్ అయ్యాయి. ఇక గౌతమి కపూర్ సైతం తన పాత్ర లో చాలా బాగా నటించింది. మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సిరీస్ కి మ్యూజిక్ చాలా వరకు ఒకే అనిపించింది. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమాటోగ్రఫీ విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది…అందుకే ప్రతి షాట్ చాలా రిచ్ గా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయంలో మాత్రం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఇంకా కొంచెం షార్ప్ చేస్తే బాగుండేది…
ప్లస్ పాయింట్స్
కథ
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్
ఎమోషనల్ సీన్స్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేది…
కొన్ని అనవసరమైన సీన్స్…
రేటింగ్
ఈ సిరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2.25/5