https://oktelugu.com/

Photo Story: తల్లి, ఇద్దరు సోదరుల మధ్య ఉన్న ఈ స్టార్ ఎవరో చెప్పుకోండి?

ఆ ఫొటో ఎవరిదో కాదు.. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేస్ ది. తెలుగు అమ్మాయినే అయినా చెన్నైలో పుట్టిపెరిగిన ఈమె ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ గా మారింది. తన చిన్నతనంలోనే తండ్రి రాజేష్ చనిపోయాడు. ఒకప్పుడు రాజేష్ తెలుగులో అగ్ర నటుడిగా కొనసాగాడు. దీంతో కటుుంబ బాధ్యతను తల్లి తీసుకొని ఐశ్వర్యరాజేశ్ తో పాటు తన ఇద్దరు సోదరులను చదివించింది. దురదృష్టవశాత్తూ ఐశ్వర్యరాజేష్ సోదరులు చనిపోయారు. దీంతో ఐశ్వర్య కుటుంబ బాధ్యతలు చేపట్టింది. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది

Written By:
  • Srinivas
  • , Updated On : July 11, 2023 / 09:40 AM IST

    Photo Story

    Follow us on

    Photo Story: వెండితెరపై కనిపించే కొందరు భామలు తమ అందచందాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. కానీ ఇతరులకు వినోదాన్ని పంచే వారి రియల్ లైఫ్ లో ఎన్నో విషాద గాథలు ఉంటాయి. చాలా మంది ఇండస్ట్రీకి ఏదోసాధించాలనే వస్తారు. కానీ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక భారంతో అనుకున్నది సాధించలేకపోతారు. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం హీరోయిన్ గా చలామణి అవుతున్న ఓ నటికి చిన్నప్పటి నుంచే కష్టాలు. అయినా పట్టుదలతో సినిమా ప్రపంచాన్నే నమ్ముకున్న ఆమె ప్రస్తుతం బిజీ హీరోయిన్ అయిపోయింది. తండ్రి, మేనత్తలు సినిమా వాళ్లే అయినా స్టార్ ఇమేజ్ మాత్రం వారి అండతో రాలేదు. తన ప్రతిభను నమ్ముకోవడంతో ఆమె ఫేమస్ కావడానికి విపరీతంగా ప్రయత్నిస్తోంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించి ఓ చైల్డ్ పిక్ అందరినీ అలరిస్తోంది.

    ఆ ఫొటో ఎవరిదో కాదు.. ప్రముఖ నటి ఐశ్వర్య రాజేస్ ది. తెలుగు అమ్మాయినే అయినా చెన్నైలో పుట్టిపెరిగిన ఈమె ప్రస్తుతం తమిళ సినిమాల్లో బిజీ హీరోయిన్ గా మారింది. తన చిన్నతనంలోనే తండ్రి రాజేష్ చనిపోయాడు. ఒకప్పుడు రాజేష్ తెలుగులో అగ్ర నటుడిగా కొనసాగాడు. దీంతో కటుుంబ బాధ్యతను తల్లి తీసుకొని ఐశ్వర్యరాజేశ్ తో పాటు తన ఇద్దరు సోదరులను చదివించింది. దురదృష్టవశాత్తూ ఐశ్వర్యరాజేష్ సోదరులు చనిపోయారు. దీంతో ఐశ్వర్య కుటుంబ బాధ్యతలు చేపట్టింది. సినిమా ఇండస్ట్రీలో వచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తోంది.

    తెలుగులో ‘కౌసల్యా కృష్ణ మూర్తి’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది ఐశ్వర్యరాజేశ్. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అయినా తాను ఈ సినిమా చేస్తానని ఒప్పుకుంది. అంతేకాకుండా ఇందులో డీ గ్లామర్ పాత్ర చేసి అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ వంటి చిత్రాల్లో నటించిన ఐశ్వర్యకు ఇక్కడ స్టార్ ఇమేజ్ రాలేదనే చెప్పాలి. దీంతో తమిళ ఇండస్ట్రీ నుంచి ఆమెకు పలు ఆఫర్లు వచ్చాయి. దీంతో అక్కడ వరుస సినిమాలు చేస్తే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. లేటేస్టుగా పర్హానా అనే మూవీలో ఐశ్వర్య రాజేశ్ నటించింది. ఈ మూవీ జూలై 7న రిలీజ్ అయింది.

    ఓ టీవీ షో లో యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి ఐశ్వర్య అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు తీరికలేకుండా మారిపోయిది. 2011లో మనాడ మైలాడ అనే రియాల్టీ షోలో విజేతగా నిలచిన తరువాత ఫేమస్ అయింది. ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లిదండ్రులను మరువద్దు అని చెప్పే ఐశ్వర్యకు తల్లంటే ప్రాణం. ప్రతీ విషయాన్ని ఆమెతో షేర్ చేసుకుంటుంది. అయితే తాను చిన్నగా ఉన్నపుడు బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసిన ఓఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.