https://oktelugu.com/

Sri Satya: వాటికి సర్జరీ చేయించుకున్న బిగ్ బాస్ బ్యూటీ… ఛీ, అప్పుడే బాగున్నాయి అంటూ జనాల సెటైర్స్!

తాజాగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్య సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. శ్రీసత్య బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్. హౌస్ లో శ్రీసత్య అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 3, 2024 / 05:35 PM IST

    Sri Satya

    Follow us on

    Sri Satya: గ్లామర్ ఇండస్ట్రీలో అందమే పెట్టుబడి. ఒడ్డు పొడుగు ఉన్నవాళ్ళకు ప్రాధాన్యత ఉంటుంది. ఆ అందం కోసం హీరోయిన్స్ పడే కష్టం అంతా ఇంతా కాదు. డైట్ ఫాలో అవుతూ కడుపు మాడ్చుకుంటారు. యోగా, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తారు. కొందరు హీరోయిన్స్ అయితే సహజంగా సంక్రమించిన అందాలకు సర్జరీలతో మరింత మెరుగు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి చాలా మంది హీరోయిన్స్ అందం కోసం సర్జరీలను ఆశ్రయించారు.

    తాజాగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీసత్య సర్జరీ చేయించుకున్నట్లు సమాచారం. శ్రీసత్య బిగ్ బాస్ తెలుగు 6 కంటెస్టెంట్. హౌస్ లో శ్రీసత్య అత్యంత నెగిటివిటీ మూటగట్టుకుంది. పక్క కంటెస్టెంట్స్ ని తెలివిగా వాడుకుంటూ తన గేమ్ ఆడేది. శ్రీసత్య ఫైనల్ కి ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బయటకు వచ్చింది. ఆమె అంతకు ముందే ఎలిమినేట్ కావాల్సింది. ఫ్యామిలీ వీక్ లో శ్రీసత్య తల్లి వీల్ చైర్ లో రావడంతో ఆమెకు సెంటిమెంట్ కలిసొచ్చింది.

    ఇదిలా ఉంటే హౌస్ నుండి వచ్చాక శ్రీసత్య పలు బుల్లితెర షోలలో సందడి చేస్తుంది. బీబీ జోడిలో మెహబూబ్ తో జతకట్టిన శ్రీసత్య మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అయితే శ్రీసత్య జోడీకి టైటిల్ దక్కలేదు. అనూహ్యంగా ఫైమా, ఆర్జే సూర్య టైటిల్ విన్నర్స్ అయ్యారు. కాగా శ్రీసత్య సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తరచుగా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తుంది.

    శ్రీసత్య లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ అండ్ నెటిజెన్స్ ఓ విషయం గమనించారు. ఆమె ముఖంలో ఓ పార్ట్ భిన్నంగా కనిపిస్తుంది. శ్రీసత్య తన పెదాలకు సర్జరీ చేయించినట్లు నెటిజెన్స్ భావిస్తున్నారు. దాంతో ఆమెను ట్రోల్ చేయడం షురూ చేశాడు. ఛీ… నీ పెదవులు గతంలోనే బాగున్నాయి. సర్జరీ తర్వాత ఛండాలంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. శ్రీసత్య ఈ నెగిటివ్ కామెంట్స్ పై స్పందించకపోవడం విశేషం.