Rithu Chowdary: లగ్జరీ కారు సొంతం చేసుకున్న జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి… దాని ధర తెలిస్తే అవాక్కే!

రీతూ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చాలా హాట్ గా ఉంటాయి. మితిమీరిన స్కిన్ షో చేస్తుంది. రీతూ చౌదరి ఫోటో షూట్స్ పై విమర్శలు వినిపిస్తుంటాయి. అయినా రీతూ చౌదరి తగ్గదు. ఎవరేమనుకున్నా అందాల ప్రదర్శన ఆపదు.

Written By: S Reddy, Updated On : June 20, 2024 6:39 pm

Rithu Chowdary

Follow us on

Rithu Chowdary: రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ హాట్ బ్యూటీ సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించింది. పలు తెలుగు సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. కానీ బ్రేక్ రాలేదు. లాభం లేదని జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ లేడీ కమెడియన్ అవతారం ఎత్తింది. హైపర్ ఆదితో పాటు ఒకరిద్దరు టీమ్ లీడర్స్ తో కలిసి పని చేసింది. గతంతో పోల్చితే జబర్దస్త్ ఆమెకు కొంత ఫేమ్ తెచ్చింది. ఆ పాపులారిటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సొంతం చేసుకుంది.

రీతూ ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ చాలా హాట్ గా ఉంటాయి. మితిమీరిన స్కిన్ షో చేస్తుంది. రీతూ చౌదరి ఫోటో షూట్స్ పై విమర్శలు వినిపిస్తుంటాయి. అయినా రీతూ చౌదరి తగ్గదు. ఎవరేమనుకున్నా అందాల ప్రదర్శన ఆపదు. ఈ మధ్య నటిగా కూడా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. రీతూ చౌదరి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వ్యూహం సిరీస్ లో ఓ పాత్ర చేసింది.

వ్యూహం వెబ్ సిరీస్లో రీతూ చౌదరి హీరో సిస్టర్ రోల్ చేసింది. అలాగే దావత్ పేరుతో ఒక టాక్ షో నిర్వహిస్తుంది. యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ దావత్ షోలో రీతూ చౌదరి ప్రశ్నలు దారుణంగా ఉంటున్నాయి. డబుల్ మీనింగ్ తో కూడిన ఆమె ప్రశ్నలు ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా, నటిగా రీతూ చౌదరి సంపాదన బాగానే ఉన్నట్లు ఉంది. ఏకంగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది.

తాను కొత్త కారు కొనుగోలు చేసిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. బ్లాక్ కలర్ టయోటా కారు పక్కన నిల్చొని ఫోజులిచ్చింది. వాళ్ళ అమ్మతో పాటు షో రూమ్ కి వెళ్లిన రీతూ చౌదరి కారును సొంతం చేసుకుంది. ఇక ఈ కారు ధర రూ. 30 లక్షలకు పైమాటే అంటున్నారు. కాగా గతంలో రీతూ చౌదరి ఒక కారు కొన్నారు. ఆ కారులోనే తండ్రి ప్రాణం విడిచాడట. ఆ కారు నడుపుతుంటే పక్క సీట్లో ఉన్న కూర్చున్న భావన కలుగుతుందని రీతూ చౌదరి గతంలో చెప్పారు.