Extra Jabardasth
Extra Jabardasth: జబర్దస్త్ ఫైమా అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరు. తన కామెడీ టైమింగ్, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఫైమా అభిమానులను సొంతం చేసుకుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కాగా గతంలో ఫైమా తన తోటి కమెడియన్ ప్రవీణ్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపించాయి. బిగ్ బాస్ వేదికగా ఫైమా కూడా ప్రవీణ్ తనకు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చింది . ప్రవీణ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
దీంతో వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అంతా భావించారు. కానీ ప్రవీణ్ – ఫైమా ఇటీవల విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఫైమా కూడా స్పందించింది. కేవలం షో కోసం మాత్రమే క్లోజ్ గా ఉన్నాం అని ఇది నిజం కాదని తెలిపింది. కానీ ప్రవీణ్ కి తనకు మధ్య సమస్యలు ఉన్నాయని అందుకే మాట్లాడుకోవడం లేదని చెప్పుకొచ్చింది. తాజాగా నరేష్ ఫైమా పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఫైమా ఒక్కరు కాదు ముగ్గురు జీవితాలతో ఆడుకుంది అంటూ నరేష్ చెప్పడం సంచలనంగా మారింది. తాజాగా బుల్లెట్ భాస్కర్, నరేష్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ముందుగా ఏవో రేషన్ లెక్కలు చెప్పి నరేష్ నవ్వించాడు. ఈ క్రమంలో ఫైమా టాపిక్ వచ్చింది. ఆమె ముగ్గురు జీవితాలతో ఆడుకుంది అని నరేష్ అన్నాడు. దీంతో సెట్ మొత్తం అరుపులతో హోరెత్తింది. అయితే ఇదంతా స్కిట్ లో భాగమే.
నరేష్ సరదాగా ఫైమా పై ఇలాంటి కామెంట్స్ చేశాడు. తాజాగా విడుదలైన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఫైమా జబర్దస్త్ లో స్కిట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత కొంత కాలం స్టార్ మాలో పలు షోలు చేస్తూ సందడి చేసింది. ఇప్పుడు మళ్లీ తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కంటిన్యూ చేస్తుంది. భాస్కర్ టీం లో స్కిట్స్ చేస్తూ కడుపుబ్బా నవ్విస్తుంది. బుల్లెట్ భాస్కర్, ఫైమా కాంబినేషన్ నవ్వులు పూయిస్తోంది.
Web Title: Extra jabardasth latest promo 17th may 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com