Shobha Shetty
Shobha Shetty: కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులర్ అయింది శోభా శెట్టి. ఈ సీరియల్ లో మోనిత పాత్రలో అద్భుతంగా విలనిజం పండించింది. కార్తీక దీపం సక్సెస్ లో శోభ శెట్టి పాత్ర ఎంతగానో ఉంది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శోభ శెట్టి బిగ్ బాస్ సీజన్ 7 లో ఛాన్స్ కొట్టేసింది. హౌస్ లో అడుగుపెట్టి తనదైన గేమ్ తో ఆకట్టుకుంది. అదే సమయంలో వ్యతిరేకత మూటగట్టుకుంది.
బిగ్ బాస్ హౌస్లో శోభ ప్రవర్తన చూసి రియల్ లైఫ్ లో కూడా ఈమె విలనే అని జనాలు ఫిక్స్ అయ్యారు. తన ప్రవర్తనతో విపరీతంగా నెగిటివ్ అయింది శోభ శెట్టి. 14వ వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. హౌస్ లో ఉన్నపుడు తన ప్రేమ విషయం బయటపెట్టింది. సీరియల్ నటుడు యశ్వంత్ రెడ్డిని ప్రియుడిగా పరిచయం చేసింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ చెప్పుకొచ్చింది. చెప్పిన విధంగానే రీసెంట్ గా యశ్వంత్ రెడ్డితో నిశ్చితార్థం చేసుకుంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్ గా ఈ వేడుక జరిగింది.
తాజాగా శోభా శెట్టి తన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. యశ్వంత్ తో కలిసి గృహప్రవేశం చేసింది. ఈ వేడుకకు పలువురు బుల్లితెర సెలెబ్రెటీలు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హాజరయ్యారు. ప్రియాంక జైన్, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్, గౌతమ్ కృష్ణ ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో టేస్టీ తేజ పోస్ట్ చేశారు. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
శోభా శెట్టి ప్రస్తుతం సీరియల్స్ చేయడం లేదు. ఆమెకు కార్తీకదీపం 2 లో కూడా ఛాన్స్ దక్కలేదు. ప్రస్తుతం యాంకర్ గా మారింది. సుమన్ టీవిలో కాఫీ విత్ శోభా అనే షో హోస్ట్ చేస్తుంది. ఇక ఖాళీ సమయం దొరికినప్పుడు ప్రియుడితో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేసినట్లు గతంలో శోభ శెట్టి వెల్లడించింది. శోభ శెట్టి ఇల్లు అద్భుతంగా ఉంది.
Web Title: Bigg boss shobha shetty entered the new house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com