Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ హౌస్ లో జరిగేవన్నీ హైక్లాస్ డ్రామాలే. ఓటింగ్ ప్రక్రియ నుంచి ఎలిమినేషన్ వరకు అంతా స్క్రిప్టెడ్ అనే ఓ వాదన ఉంది. హోస్ట్ నాగార్జునతో పాటు నిర్వాహకులు దీన్ని ఖండించారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే కంటెస్టెంట్స్ ఎమోషనల్ డ్రామాలు, కన్నింగ్ ప్లానులు వేయాలంటారు. ఇక వాళ్ళు వేసే అతివేశాలకు మరింత హైప్ ఇస్తూ ఉంటారు హోస్ట్ అక్కినేని నాగార్జున.
Also Read: ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణి సాక్షి శివానంద్.. మరి ఇప్పుడు ఎక్కడ ఉంది?
బిగ్ బాస్ సక్సస్ జర్నీలో హోస్ట్ నాగార్జున కూడా చాలా కీలకం అని చెప్పాలి. బిగ్ బాస్ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని విజయవంతంగా ఐదు సీజన్లు నడిపించారు. బిగ్ బాస్ సీజన్ 1ని జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. తారక్ హోస్టింగ్ తో సీజన్ 1 కి మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత హీరో నాని రంగంలోకి దిగారు. సీజన్ 2 ని అద్భుతంగా హోస్ట్ చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి నాగార్జున హోస్టింగ్ బాధ్యతలు చేపట్టారు.
అప్పటి నుంచి ఆయనే బిగ్ బాస్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. ఆయన ఎనర్జీ లెవెల్స్, స్పాంటేనిటీ, కామెడీ టైమింగ్ తో సక్సస్ ఫుల్ హోస్ట్ అనిపించుకున్నారు. బుల్లితెర ఆడియన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే అప్పట్లో కొన్ని కాంట్రవర్సీలు రావడంతో నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవాలు అని తేలింది. ఇక సీజన్ 8 కి కూడా హోస్ట్ గా నాగార్జున కంటిన్యూ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన రెమ్యూనరేషన్ కి సంబంధించిన లీక్స్ బయటకు వచ్చాయి. ఆయనకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. నాగార్జున సీజన్ 8 కోసం ఏకంగా రూ. 25 కోట్లు తీసుకుంటున్నారట. ఇప్పటివరకు ఆయన హోస్ట్ చేసిన అన్ని సీజన్లలో ఇదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తుంది. మూడో సీజన్ కోసం ఆయన కేవలం రూ 3.80 కోట్లు అందుకున్నారట. ఆ తర్వాత సీజన్ కి రూ. 6 కోట్లు, రూ. 8 కోట్లు, రూ. 15 కోట్లు ఇలా తీసుకున్నారు.
ఇప్పుడు ఒకేసారి ఏకంగా పది కోట్లు పెంచారని సమాచారం. అయితే సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. సల్మాన్ కేవలం ఒక ఎపిసోడ్ కి రూ. 12 కోట్లు తీసుకుంటాడని సమాచారం. నెలలో నాలుగు వీకెండ్స్ లెక్కన సల్మాన్ ఖాన్ 8 ఎపిసోడ్స్ కి రూ. 96 కోట్లు తీసుకుంటాడట. బిగ్ బాస్ మూడు నెలలు సాగుతుంది కాబట్టి సల్మాన్ ఖాన్ సీజన్ కి రూ. 288 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
అయితే బిగ్ బాస్ సెట్ వేసేది అన్నపూర్ణ స్టూడియోస్ లోనే కాబట్టి ఆ రెంట్ కూడా కలిపి ఆయనకు రూ. 30 కోట్ల వరకు ఆదాయం రాబోతుందని టాక్. ఇక ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ కుబేర ‘ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరో ధనుష్ తో కలిసి నాగార్జున నటిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ లో కుబేర థియేటర్స్ లో విడుదల కానుంది.
Also Read: రాజమౌళి కల్కి మూవీలో నటించడానికి అసలు కారణం ఇదా… కీలక విషయం వెలుగులోకి!
Web Title: Bigg boss hosts salman khan and nagarjuna remunerations details
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com