Television to silver screen heroes : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ నటులుగా కొనసాగుతున్నవాళ్లు ఒకప్పుడు ఎన్నోకష్టాలు పడ్డారు. కింది స్థాయి నుంచి తమ ప్రతిభను చూపిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇంత స్టేజీకి వచ్చారు. అప్పట్లో సినిమాల్లో అవకాశం రావడమంటే మాములు విషయం కాదు. ఎన్నో ప్రయాసలు పడ్డారు. ఇక సినిమాల్లో అవకాశం రాని వారు టీవీల్లోనైనా ఛాన్స్ వస్తే చాలనుకునేవారు ఎందరో ఉన్నారు. అలా బుల్లితెర కోసం ట్రై చేసి ఛాన్స్ కొట్టేసిన కొందరు.. ఆ తరువాత సక్సెస్ అయ్యారు. బుల్లితెరపై విజయవంతంగా నటించిన వారు ఆ తరువాత సినిమాల్లో నటించి స్టార్ నటులుగా ఎదిగారు. ఈ పరిస్థితి టాలీవుడ్, బాలీవుడ్లోనూ ఉంది. అయితే అలా బుల్లి తెర నుంచి వెండితెరకు ప్రయాణం సాగించిన నటులెవరో చూద్దాం.

కలర్ స్వాతి: స్వాతిరెడ్డి అనే యువతి ముందుగా ఓ ఛానెల్ లో ‘కలర్స్’ అనే ప్రొగ్రాం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ ప్రొగ్రాంకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో ఆమె పేరు ‘కలర్స్ స్వాతి’గా మారిపోయింది. ఆ తరువాత ఈ భామకు సినిమాల్లో నటించాలని కొందరు సజెషన్ ఇవ్వడంతో ఫిల్మ్ నగర్లో ట్రై చేసింది. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ‘డేంజర్’ అనే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తరువాత చాలా సినిమాల్లో కలర్స్ స్వాతి హీరోయిన్ గా అలరించింది.
అవికాగోర్: బుల్లితెరపై ‘చిన్నారి పెళ్లి కూతురు’ ఎవరంటే అవికా గోర్ పేరు టక్కున చెప్పేస్తారు ఆడియన్స్. అంతలా పేరు తెచ్చుకొని పాపులరిటీ సాధించింది ఈమె. ఈసీరియల్ లో ఆమె నటకు ఎక్కువే మార్కులు పడడంతో సినిమాల్లోకి అవకాశం ఇచ్చారు. దీంతో ఆమె తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తరువాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్త మావ’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
షారుఖ్ ఖాన్: బాలీవుడ్ బాద్ షా గా పేరొందిన షారుఖ్ ఖాన్ కూడా టీవీ నుంచి వచ్చిన నటుడే. ‘ఫౌజీ’ అనే సీరియల్ ద్వారా పరిచయం అయిన షారుఖ్ ఆ తరువాత ‘సర్కస్’, ‘వాగ్లేకి దునియా’ వంటి టీవీ షో ల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువా ఈ నటుడి ఫర్ఫామెన్స్ చూసి ‘దివానా’ అనే సినిమాలో అవకాశం ఇచ్చారు. ఇందులోఆయన రిషీ కపూర్ తో కలిసి నటించారు. ఆ తరువాత షారుఖ్ నట ప్రస్థానం సక్సెస్ ఫుల్ గా రన్నయిన విషయం తెలిసిందే.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సైతం మొదట్లో బుల్లితెరపై సందడి చేశారు. ‘పవిత్ర రిస్థా’ అనే హింది సినిమాలో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తరువాత ‘కై పో చే’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా వచ్చిన సినిమా ద్వారా సుశాంత్ స్టార్ నటుడు అయ్యారు.
ఇర్ఫాన్ ఖాన్: బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నట ప్రస్థానం టీవీ నుంచే మొదలైంది. 1988లో ఆయన ‘భారత్ ఏక్ ఖోజ్, సారా జహాన్ హమారా, బనేగీ అప్నీ బాద్, చంద్రకాంత్ వంటి సిరియల్స్ లో నటించారు. ఇక ఆ తరువాత ఇర్ఫాన్ ఖాన్ ‘సలాం బొంబాయ్’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువత ఎక్ డాక్టర్ కీ మౌత్, ది వారియర్ సినిమాలు చేసి స్టార్ నటుడయ్యాడు.