https://oktelugu.com/

Sreemukhi: వలపుల సోయగాలతో కనువిందు చేస్తున్న శ్రీముఖి.. వైరల్ ఫొటోలు

ఎలాంటి ప్రొగ్రామ్ లో అయినా తనదైన శైలితో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేస్తుంది. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అడుగు పెట్టిన ఈ ముద్ధుగుమ్మ పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాదు వరుస అవకాశాలతో కెరీర్ లో దూసుకెళ్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 22, 2023 / 12:39 PM IST

    Sreemukhi

    Follow us on

    Sreemukhi: శ్రీముఖి.. అంటే ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించారు శ్రీముఖి. తన మాటలతో మాయ చేస్తూ హావభావాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

    ఎలాంటి ప్రొగ్రామ్ లో అయినా తనదైన శైలితో ప్రేక్షకులను ఇట్టే కట్టి పడేస్తుంది. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అడుగు పెట్టిన ఈ ముద్ధుగుమ్మ పలు సినిమాల్లో కనిపించారు. అంతేకాదు వరుస అవకాశాలతో కెరీర్ లో దూసుకెళ్తున్నారు. తెలుగు రియాల్టీ షో అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ -3 లో సైతం పాల్గొన్నారు శ్రీముఖి. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచి మరింత పేరు గడించారు. వెండితెరపై శ్రీముఖి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా క్రేజీ అంకుల్స్. ఇ సత్తిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంతో శ్రీముఖి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాదు ఇటీవల చిరంజీవి నటించిన భోళాశంకర్ లో సైతం శ్రీముఖి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

    యాంకర్ గా, నటిగా రాణిస్తున్న శ్రీముఖి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు.. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ను, వీడియోస్ ను అభిమానులతో పంచుకుంటారు.. పటాస్ కామెడీ షో ద్వారా మంచి ఫాలోయింగ్ సంపాదించిన శ్రీముఖి బుల్లితెర రాములమ్మగా పేరుగాంచారు. ఢీ వంటి షోలతో పాటు పలు ఛానల్స్ లో స్పెషల్ ఈవెంట్స్ కు వ్యాఖ్యాతగా చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు.

    సామాజిక మాధ్యమాల వేదికగా శ్రీముఖి తన అందాల ఆరబోతతో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది. వలపుల సోయగాలతో మతులు చెడగొడుతోంది. రోజురోజుకి గ్లామర్ డోస్ పెంచుతున్న ఈ అందాల భామను ఎవరైనా అదరహో అనాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫొటో షూట్స్ తో అదరగొడుతూనే ఉంటుంది..తాజాగా ఆమె ఫొటోస్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. శ్రీముఖి అందాల చూసి నెటిజన్లు మైమరచిపోతున్నారు. ఈ ముద్ధుగుమ్మ కిర్రాక్ పోజులతో నెటిజన్లను ఆకర్షిస్తుంది.