https://oktelugu.com/

హైపర్ ఆది పై పోలీసులకు ఫిర్యాదు

జబర్దస్త్ నటులపై కేసులు కొత్తేమీ కాదు.గతంలో జబర్దస్త్ ఫేమ్ వండర్ వేణు పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మ, తెలంగాణ యాస, భాషలను కించపరిచేలా హైపర్ ఆది స్కిట్ ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన జాగృతి […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 14, 2021 / 07:16 PM IST
    Follow us on

    జబర్దస్త్ నటులపై కేసులు కొత్తేమీ కాదు.గతంలో జబర్దస్త్ ఫేమ్ వండర్ వేణు పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు హైదరాబాద్ లోని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మ, తెలంగాణ యాస, భాషలను కించపరిచేలా హైపర్ ఆది స్కిట్ ప్రదర్శించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    ఈ మేరకు ఎల్బీ నగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన జాగృతి సభ్యులు హైపర్ ఆదిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైపర్ ఆదితో పాటు స్కిృప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్ పై కూడా చర్యలు తీసుకోవాలని జాగృతి సభ్యులు కోరినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేసిన వారిలో తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టీఎస్ యూ ాష్ర్ట కార్యదర్శి చింత మహేశ్, హ్యూమన్ రైట్స్ రాష్ర్ట అధ్యక్షుడు జగదీష్ తదితరులు ఉన్నారు ఫిర్యాదుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    జబర్దస్త్ ప్రారంభంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. మగవారికి ఆడ వేషాలు వేస్తూ కామెడీ కోసం కక్కుర్తి పడుతున్నారు కామెంట్ సైతం వచ్చాయి. రోజురోజుకు ప్రేక్షకుల్లో పెరుగుతున్న క్రేజ్ వారికి ప్రాధాన్యం లేకుండా పోయింది. అయితే ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసేలా ఉండకూడదనే కనీస పద్ధతులు పాటించడం లేదని విమర్శలు వస్తున్నాయి.

    తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగపై ఉన్న విశ్వాసం మామూలుది కాదు. అనాదిగా వస్తున్న సంప్రదాయం పండుగల్లో బతుకమ్మ ఒకటి. అలాంటి బతుకమ్మ పండుగపై కామెంట్ చేయడం ఒక నటుడిగా ఆది తగదని ప్రజలు పేర్కొంటున్నారు. దానికి తగిన సమాధానం చెప్పలేదు విడిచిపెట్టేది లేదని చెబుతున్నారు. మనోభావాలు దెబ్బ తినకుండా ఎంత నవ్వించుకున్నా పట్టించుకోరు. కానీ ప్రజల అభిమానులపై దెబ్బ కొడితే ఊరుకోరని తెలుస్తోంది.