10 కేజీఎఫ్ లతో బన్నీ ‘పుష్ప’ సమానమట!

కేజీఎఫ్.. సైలెంట్ గా వచ్చిన ఈ కన్నడ చిత్రంలో అప్పటివరకు పేరున్న హీరో లేడు.. పేరున్న దర్శకుడు కాదు.కానీ కోలార్ బంగారు గనులపై తీసిన ఈ చిత్రం కన్నడనాటే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రికార్డులు కొల్లగొట్టింది. కానీ అంతకుమించిన కథాంశంతో తెలుగులో సినిమా తీస్తున్నారట.. అది 10 కేజీఎఫ్ లతో సమానమని అంటున్నాడు టాప్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు. దీంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి. తెలుగు సినిమా ప్రేక్షకులు […]

Written By: NARESH, Updated On : June 15, 2021 9:54 am
Follow us on

కేజీఎఫ్.. సైలెంట్ గా వచ్చిన ఈ కన్నడ చిత్రంలో అప్పటివరకు పేరున్న హీరో లేడు.. పేరున్న దర్శకుడు కాదు.కానీ కోలార్ బంగారు గనులపై తీసిన ఈ చిత్రం కన్నడనాటే కాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రికార్డులు కొల్లగొట్టింది. కానీ అంతకుమించిన కథాంశంతో తెలుగులో సినిమా తీస్తున్నారట.. అది 10 కేజీఎఫ్ లతో సమానమని అంటున్నాడు టాప్ దర్శకుడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు. దీంతో దీనిపై అంచనాలు మరింత పెరిగాయి.

తెలుగు సినిమా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. తాజాగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ‘పుష్ప’ చిత్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

బుచ్చిబాబు తన గురువు అయిన సుకుమార్ తీసిన ‘పుష్ప’ సినిమాను చూశాడట.. ఈ సినిమాపై బుచ్చిబాబు హాట్ కామెంట్స్ చేశాడు. పుష్ప మొదటి భాగం పది ‘కేజీఎఫ్’లతో సమానమని బుచ్చిబాబు బాంబు పేల్చారు. హీరో క్యారెక్టరైజేషన్ తోపాటు ఎలివేషన్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ ఉంటాయని ఆయన అన్నారు. పుష్ప సినిమాపై బుచ్చిబాబు ఇచ్చిన రివ్యూతో ఆ సినిమాపై అంచనాలు ఆకాశన్నంటాయి.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో పుష్ప సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది. మిగిలిన భాగాన్ని షూటింగ్ చేయనున్నారు. రెండు భాగాలుగా సినిమా తీస్తున్నారు. బన్నీ సరసన రష్మిక నటిస్తోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కరోనాతో సినిమా వాయిదా పడింది. ఆగస్టు 13న సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేసినా షూటింగ్ వాయిదాతో చిత్రం ఆలస్యం కానుంది.