Akhanda Movie: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్నసినిమా అఖండ. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు ఈ సినిమా సర్వం సిద్ధమవుతోంది. ఈ సినిమాలో బాలయ్య కు జోడీగా ప్రాగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… ప్రముఖ హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. అలానే జగపతిబాబు, పూర్ణ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సింహా, లెజెండ్ చిత్రాలతో సూపర్ హిట్ కొట్టిన బోయపాటి… మరోసారి బాలయ్యతో హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అఖండ సినిమా ఫ్యాన్స్ కు శుభ వార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

Also Read: మాస్.. ఊరమాస్.. బాలయ్య శివతాండవం..‘అఖండ’ మూవీ ట్విట్టర్ రివ్యూ
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా స్పెషల్ షో లకు… అలాగే టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే డిసెంబర్ రెండవ తేదీన హైదరాబాద్ కూకట్పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున్ థియేటర్లో మాత్రమే ఈ వెసులుబాటును కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ధియేటర్ యాజమాన్యాలు కరోనా నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అలాగే రద్దీ నియంత్రణకు ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకోవాలని సూచనలు చేసింది. నిర్మాతలు, థియేటర్ అసోసియేషన్ సభ్యుల వినతి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ లకు భారీ స్పందన లభించింది.
Also Read: ‘అఖండ’ అఖండమైన విజయానికి అదే కారణం !