Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ అంటే ఏంటో అనుకున్నాం గానీ.. ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఎందుకంటే మొదటి నుంచి ఓటీటీ వేదికగా వస్తున్న ఈ షోలో.. అన్నీ ఊహించని పరిణామాలే జరుగుతున్నాయి. వాస్తవంగా జరగాల్సిన వాటికంటే భిన్నమైన ట్విస్టులు ఇస్తున్నాడు బిగ్ బాస్.

ఇప్పటికే నాలుగు వారాల షో పూర్తి కాగా.. ఐదో వారంలో ఊహించని ఘటన జరిగింది. ఈ వారం నామినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. బింధు మాదవి, యాంకర్ శివ, అరియానా, తేజస్వి, అనిల్ రాథోడ్, స్రవంతి, మిత్రశర్మ ఉన్నారు. అయితే అందరూ ఊహించినట్టు గానే ఓటింగ్ లో టాప్ లో బింధు మాదవి ఉంది. రెండో స్థానంలో శివ, తర్వాత అరియాన, నాలుగో స్థానంలో అనిల్ ఉన్నారు.
Also Read: Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ : బన్నీ అభిమాని అవుట్
అయితే డేంజర్ జోన్ లో తేజస్వి, మిత్రాశర్మ, స్రవంతి ఉన్నారు. వీరిందరిలో కెల్లా స్రవంతికి తక్కువ ఓటింగ్ వస్తోంది. దీంతో ఆమెనేఏ ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన తేజస్వి ఎలిమినేట్ అయిపోయింది. అదేంటి ఆమెకు బాగానే ఓటింగ్ వచ్చింది కదా అని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఉగాది స్పెషల్ ఎపిసోడ్ లో ఫైనల్ ఎలిమినేషన్ లో ఇద్దరు ఉన్నారు. ఇందులో తేజస్వి, స్రవంతి ఉండగా.. మిగతా వారంతా సేఫ్ అయిపోయారు. అయితే ఇందులో స్రవంతి ఎలిమినేట్ అవుతుందని అందరూ అంచనా వేశారు. ఈ క్రమంలోనే వారిద్దరి ముందు రెండు ఫిష్ జార్స్ పెట్టాడు బిగ్ బాస్. అందులో పసుపు పచ్చ నీటిని ఉంచి, వాటిలో వాటర్ బాలితో నీళ్లు పోయమని చెప్పారు. ఎవరి జార్ అయితే పసుపు రంగు నుండి ఎరుపు రంగులోకి మారుతుందో వారి ఎలిమినేట్ అవుతారని చెప్పారు. కాగా తేజస్వి జార్ ఎరుపు రంగులోకి మారింది. ఇంకేముంది ఆమె ఎలిమినేట్ అయిపోయింది.

అయితే వెళ్లిపోయే ముందు నటరాజ్ మాస్టర్ మీద కొంచెం సీరియస్ అయింది. అతనే నామినేట్ చేశాడు కదా. అలాగే తన టీమ్ సభ్యులందరికీ నామినేషన్స్ విషయంలో సీరియస్ గా ఉండాలంటూ సూచించింది. ఇక నాగార్జన దగ్గరకు వెళ్లి కొంచెం ఎమోషనల్ అయింది. ఇక తాను కోపం తగ్గించుకుని ఆడటమే ఎవరికీ నచ్చలేదని అందుకే ఎలిమినేట్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది తేజస్వి.
Also Read:Drugs In Hyderabad: డ్రగ్స్ నిరోధానికి ప్రభుత్వం కృషి చేస్తున్నా సాధ్యం కావడం లేదా?