Teja Sajja: ప్రస్తుతం ఇండస్ట్రీ లో సంక్రాంతి సినిమాల హవా నడుస్తుంది. ఈ పండక్కి నాలుగు సినిమాలు రిలీజ్ అయితే అందులో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా మాత్రం దుమ్మురేపే కలెక్షన్స్ ని సాధిస్తూ ప్రేక్షకులను రిపీటెడ్ గా ఈ సినిమాను చూసే విధంగా వాళ్లలో ఒక ఉత్సాహాన్ని అయితే కలిగిస్తుంది. ఇక ఇలాంటి సినిమాని తెరకెక్కించడానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అలాగే యంగ్ హీరో అయిన తేజ కూడా ఈ సినిమా కోసం పూర్తి ఎఫర్ట్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.ఆ ఈవెంట్ లో హీరో తేజ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ లో నేను చాలా కష్టపడ్డాను అని చెప్పాడు. ‘ముఖ్యంగా హనుమంతుడి శక్తులు నేను చేసిన హనుమంతు క్యారెక్టర్ కి వచ్చిన తర్వాత గాల్లో ఎగిరే కొన్ని షాట్స్ ఉన్నాయి. వాటి కోసం దాదాపు 6 గంటల పాటు నేను గాలిలోనే తాల్లు పట్టుకుని వేడాల్సి వచ్చింది’ అంటూ తేజ తను పడిన కష్టాన్ని తెలియజేశాడు. అలాగే క్లైమాక్స్ ఫైట్ ని దాదాపు 40 రోజులు పాటు షూట్ చేశాం ఆ సమయంలో ఎక్కువగా దుమ్ము, ధూళి లో గడపాల్సి వచ్చింది. దాని కారణంగా ‘ఆ దుమ్ము కండ్లల్లో పడి నా కుడి కన్ను కనిపించకుండా పోయింది’.
దాంతో హాస్పిటల్ కి వెళ్తే డాక్టర్లు సర్జరీ చేయాలన్నారు. కానీ షూటింగ్ టైమ్ లో కుదరదు అని చెప్పి సినిమా షూట్ అయిపోయాక చేయించుకుంటాను అని చెప్పి మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను అని తను సినిమా కోసం ఎంత ఎఫర్ట్ అయితే పెట్టాడో ఆ మొత్తాన్ని మాటల రూపంలో తెలియజేశాడు. ఇక ఇది చూస్తున్న వాళ్ళకి అయ్యో పాపం అనిపిస్తూ ఉండొచ్చు కానీ ఆ కష్టాన్ని అనుభవించిన వాళ్ళకి మాత్రమే దాని పెయిన్ అనేది తెలుస్తుంది.
ఇక సినిమా మీద ఎంత పిచ్చి ఉంటే అలాంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక తేజ ప్రశాంత్ వర్మ ఇద్దరు పడిన కష్టానికి ప్రతిఫలం అయితే దక్కింది. ఇక ఈ సినిమా సంక్రాంతికి భారీ విజయాన్ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక దీంతో పాటు గా దీనికి సీక్వెల్ గా జై హనుమాన్ అనే సినిమా కూడా రాబోతుంది.అలాగే ప్రతి సంవత్సరం సంక్రాంతి కి తను డైరెక్షన్ చేస్తూనే మిగతా డైరెక్టర్లను కూడా కలుపుకొని ఈ తరహ లోనే సూపర్ మాన్ సినిమాలను చేస్తూ రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా ప్రశాంత్ వర్మ తెలియజేశాడు…