Bandi Sanjay: బండి సంజయ్ ఎందుకు ఏడ్చాడు? కారణమేంటి?

Bandi Sanjay: బీజేపీ మహాసంగ్రామ యాత్ర నిన్న ముగించింది. జీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కంట నీరు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ విధానాలతో బీజేపీ కార్యకర్తలు కేసుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము చనిపోతే కాషాయ జెండా కప్పాలని కోరుతూ కన్నీరు కార్చారు. టీఆర్ఎస్ తీరుతో బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా కష్టాలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ […]

Written By: Srinivas, Updated On : August 28, 2022 4:48 pm
Follow us on

Bandi Sanjay: బీజేపీ మహాసంగ్రామ యాత్ర నిన్న ముగించింది. జీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కంట నీరు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ విధానాలతో బీజేపీ కార్యకర్తలు కేసుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాము చనిపోతే కాషాయ జెండా కప్పాలని కోరుతూ కన్నీరు కార్చారు. టీఆర్ఎస్ తీరుతో బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా కష్టాలు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నియంతృత్వ విధానాలతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని విలపించారు.

Bandi Sanjay

బీజేపీలో ఏ కార్యకర్తలు కూడా పదవులు ఆశించి పని చేయడం లేదు. పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికే పాటుపడుతున్నాం. కానీ టీఆర్ఎస్ మాత్రం బీజేపీని టార్గెట్ చేసుకుని కేసులు పెడుతూ భయాన్ని కలిగిస్తోంది. నిరంతరం మనపైనే గురిపెడుతూ తన కుట్రలు అమలు చేస్తోంది. దీంతో మన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంని చెబుతున్నారు. తమ ప్రాణాలు పోయినా ఫరవాలేదు కానీ కేసీఆర్ నియంత పాలనకు సమాధి కట్టడమే తమ ధ్యేయమని పిలుపునిస్తున్నారు

Also Read: Political Meetings: ఆఖరుకు సీఎంలు కూడా బతిమిలాడుకునే పరిస్థితి?

హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీతో షో నిర్వహణకు పోలీసులను పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టింది టీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. ఎవరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారో తెలుస్తోంది. కానీ బీజేపీ మీద రుద్దుతూ విమర్శలకు దిగుతోంది. దీంతో టీఆర్ఎస్ పార్టీ లిక్కర్ కుంభకోణం బయటపడుతుందనే ఉద్దేశంతోనే దాన్ని పక్కదారి పట్టించేందుకు టీఆర్ఎస్ పన్నాగం పన్నుతోందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇలాంటి చీప్ ట్రిక్కులు ప్లే చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని సంజయ్ ఆరోపిస్తున్నారు.

Bandi Sanjay

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భావోద్వేగంతో కంట నీరు పెట్టుకోవడం అందరిని కలచివేసింది. పార్టీ కోసం పనిచేసే తమకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవని తేల్చిచెప్పారు. ప్రజాసమస్యలపై పోరాడుతుంటే తమను రౌడీల్లా భావిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడానికి కుట్రలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన సాగుతుందా? లేక కుటుంబ పాలన అమలులో ఉందా అని అడుగుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు కానీ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారు. అందుకే రాష్ట్రం అధోగతి పాలవుతోందని విమర్శలు చేశారు.

Also Read: Anasuya: ఆంటీ అంటున్న వాళ్లకు ఘాటైన అందాలతో అనసూయ సమాధానం… నడుము చూపిస్తూ టెంప్ట్ చేస్తూ రచ్చ

 

 

Tags