KL Rahul: స్వతహాగా టీమిండియా ఆటగాళ్లు తమ వ్యక్తిగత జీవితం గురించి చెప్పడానికి ఇష్టపడరు. పార్టీ వెకేషన్ అంటూ తమ ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ ఉంటారు, అయితే సోషల్ మీడియాలో ఆ ఆటగాడు పలనా హీరోయిన్ తో ప్రేమ లో ఉన్నాడని అంటూ రూమర్ లు వస్తాయి వాటిని పట్టించుకోకుండా చివరికి వాళ్ళ ఇష్టపడిన అమ్మాయి తో వివాహం చేసుకుంటారు.

టీమిండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ విషయంలో కుడా అదే జరిగింది ఆయన ప్రేమిస్తున్న ప్రియురాలు గురించి ఎక్కడా చెప్పలేదు. దీంతో కెఎల్ రాహుల్ నిధి అగర్వాల్ లవ్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లు కూడా తెలిసిందే అయితే ఈ గాసిప్స్ అన్నింటికీ చెక్ పెట్టారు రాహుల్.బాలీవుడ్ నటి అతియా శెట్టి కెఎల్ రాహులల్ గత కొన్నేళ్లుగా లవ్ లో ఉన్నారని గాసిప్స్ వచ్చాయి.వాటన్నిటినీ నిజం చేస్తూ అమె పుట్టిన రోజు సందర్భంగా “హ్యాపీ బర్త్ డే మై లవ్ అంటూ ” వారు కలిసి ఉన్న ఫోటో ను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు రాహుల్.
ఈ జంట ఈ మధ్య కాలంలో లండన్ నగరంలో తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినవి. అయితే ఇదిలా ఉంటే బీసీసీఐ కి ఇచ్చిన పత్రాలలో కూడా కెఎల్ రాహుల్ భాగస్వామి లిస్ట్ లో అతియా శెట్టి పేరు ఉందని సమాచారం.